మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈ-మెయిల్‌ ఐడీ

ABN , First Publish Date - 2021-12-09T05:18:58+05:30 IST

రాష్ట్ర రవాణశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేరుతో నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ సృష్టించి తద్వారా పలు మెయిల్స్‌ను పంపిస్తున్న వ్యవహారం బయటపబడింది.

మంత్రి పువ్వాడ పేరుతో నకిలీ ఈ-మెయిల్‌ ఐడీ

హైదరాబాదులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు

ఖమ్మం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర రవాణశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేరుతో నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ సృష్టించి తద్వారా పలు మెయిల్స్‌ను పంపిస్తున్న వ్యవహారం బయటపబడింది. ఈ నకిలీ ఇ-మెయిల్‌ ఐడీ నుంచి టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ కంట్రోల్‌ మేనేజర్‌కు మెయిల్‌ పంపించడంతో అది నకిలీదని గుర్తించారు. దీనిపై టీఎస్‌ఆర్టీసీ చీప్‌ కంట్రోల్‌ మేనేజర్‌ హైదరాబాదు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2021-12-09T05:18:58+05:30 IST