ట్విట్టర్‌లో ఫిర్యాదుపై విచారణ

ABN , First Publish Date - 2021-05-15T05:51:00+05:30 IST

మధిరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఓ యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ను విచారణకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

ట్విట్టర్‌లో ఫిర్యాదుపై విచారణ

మధిరటౌన్‌,మే14: మధిరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై ఓ యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్‌ను విచారణకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వవలసిందిగా మధిర తహసిల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించగా ఈ మేరకు తహసీల్దార్‌ సైదులు శుక్రవారం హస్పటల్‌ యాజమాన్యాన్ని, పిర్యాదు దారుడిని విచారించారు. తాము రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌లు విక్రయించలేదని రోగి బందువులే తెచ్చారని డాక్టర్‌ తెలపగా, ఫిర్యాదుదారుడు తమకు ట్రీట్‌మెంట్‌ కి సంబందించిన బిల్లులు రీఎంబర్స్‌మెంట్‌ కోసం ఎన్ని సార్లు అడిగిన ఇవ్వకపోవడంతోనే కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తమకు ఆసుపత్రి వారు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఒక్కో దానికి రూ.30వేలు తీసుకొన్నది అవాస్తమని ఫిర్యాదుదారుడు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చిందిన సుగ్గల ఉమేష్‌ తెలిపాడు. 


Updated Date - 2021-05-15T05:51:00+05:30 IST