ఏన్కూరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-26T05:09:45+05:30 IST

ఏన్కూరు గ్రామపంచాయతీ కార్యదర్శి నాగశేషిరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ బుధవారం కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ఏన్కూరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ఏన్కూరు, ఆగస్టు 25: ఏన్కూరు గ్రామపంచాయతీ కార్యదర్శి నాగశేషిరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ బుధవారం కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు ఉత్తర్వులు స్థానిక మండలపరిషత్‌ కార్యాలయానికి వచ్చాయి. ఏన్కూరులో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించటం, ప్రధాన రోడ్డుపక్కనే బడ్డీకొట్టు వద్ద టైర్లలో నీళ్లు నిల్వ ఉండటం, డెంగ్యూ దోమలు, మలేరియా దోమలు ఉన్నట్లు వైద్యులు గుర్తించటం తదితర కారణాలతో కలెక్టర్‌ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. మంగళవారం ఏన్కూరు వచ్చిన  కలెక్టర్‌ టైర్లలో నిల్వఉన్న నీటిని స్వయంగా డబ్బాతో బయటకు తీసి పరిశీలించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యానికిగానూ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేశారు. ఎంపీవోకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు.


Updated Date - 2021-08-26T05:09:45+05:30 IST