కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ సమీక్ష
ABN , First Publish Date - 2021-02-02T05:23:55+05:30 IST
కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియపై ఎలక్షన్ కమిషన్ సమీక్ష

ఖమ్మం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియపై ఖమ్మంలో సమీక్షించారు. సోమవారం ఖమ్మం వచ్చిన ఆయన ఎన్నెస్పీ అతిథిగృహంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌తో సమావేశమయ్యారు. వార్డుల విభజన, నిబంధనల అమలు శాస్ర్తీయంగా ఉండాలని పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. వార్డుల విభజన, గెజిట్‌లో ప్రచురించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘంతో వార్డుల వారీగా జాబితా ప్రచురణ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, అసిస్టెంట్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి మునిసిపల్‌కమిషనర్ అనురాగజయంతి పాల్గొన్నారు.