ఉప్మాలో ముక్క పురుగులు

ABN , First Publish Date - 2021-12-19T06:19:11+05:30 IST

ఉప్మాలో ముక్క పురుగులు

ఉప్మాలో ముక్క పురుగులు
అస్వస్థతకు గురైన విద్యార్థులు

అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థులు

భద్రాచలంలోని ఏకలవ్య పాఠశాలలో ఘటన

భద్రాచలం, డిసెంబరు 18: భద్రాచలంలో నిర్వహిస్తున్న చర్లకు చెందిన రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో శనివారం ముక్కపురుగులు ఉన్న ఉప్మాను అల్పాహారంగా పెట్టినట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో అల్పాహారం కింద గోదుమ రవ్వతో తయారు చేసిన ఉప్మాలో ముక్క పురుగు లు ఉండటంతో అవి తిని తొమ్మిదిమంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి తో బాధపడ్డారు. సదరు విద్యార్థులను వెంటనే ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తర లించగా అక్కడ వారికి చికిత్స అందించి పంపారు. వారిలో ఇద్దరు విద్యార్థులను వారి తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ పాఠశాలలో ఆరునుంచి ఎనిమిది వరకు తరగతులుండగా సుమారు 180మంది బాల బాలికలు చదువు తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో తిరిగి పాఠశాలకు పంపారు. ఈ విషయమై పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఎం.శకుంతలను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా తమ వద్ద గోదుమ రవ్వ నిల్వలేదని, ఇటీవల  జీసీసీ నుంచి గోదుమరవ్వ తీసుకొచ్చామని తెలిపారు. ఈ విషయాన్ని తాము ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు. పురుగులతో ఉన్న ఉప్మారవ్వను తిరిగి జీసీసీ స్టోర్‌కు పంపినట్లు తెలిపారు. పాఠశాలలో పురుగులతో ఉన్న అల్పాహారం పెట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నారు. విద్యార్థులకు మంచి పోషకాహారం అందించాల్సిన అధికారులు పురుగులతో కూడిన ఆహారాన్ని అందించడం ఎంత వరకు సమంజసమని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-12-19T06:19:11+05:30 IST