సత్తుపల్లి డిపోకు దసరా ఆదాయం రూ.21,96,708
ABN , First Publish Date - 2021-10-22T05:17:05+05:30 IST
ఈ ఏడాది విజయదశమి పర్వదినం సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.21,96,708గా ఆదాయం వచ్చింది.
సత్తుపల్లి, అక్టోబరు 21: ఈ ఏడాది విజయదశమి పర్వదినం సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు రూ.21,96,708గా ఆదాయం వచ్చింది. గురువారం డిపో అధికారులు ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు. ఈనెల 8 తేదీ నుంచి 19వ తేదీ వరకు 11రోజుల పాటు స్పెషల్ సర్వీసుల ద్వారా 121బస్సులను 72,073కిలోమీటర్లు బస్సులు తిప్పినట్లు చెప్పారు. దీంతో ఈపీకే 30.48, ఓఆర్ 58, వీయూ 596, ఈపీబీ 18,155గా సాధించినట్లు పేర్కొన్నారు. కాగా దసరా రోజు 15వ తేదీన బస్సులను తిప్పలేదని, 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, 2020లో కరోనా ఎఫెక్ట్ వలన నడపడం కుదరలేదని చెప్పారు. సాధారణ చార్జీలతో సర్వీసులను విజయవంతంగా నడిపించిన డిపో ఉద్యోగులు, సిబ్బంది, సహకరించిన ప్రయాణీకులకు ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు.