అన్నదాతలను ఆదుకోవాలి: భట్టి

ABN , First Publish Date - 2021-10-30T05:05:39+05:30 IST

వరి రైతులను ఆదుకోవాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు.

అన్నదాతలను ఆదుకోవాలి: భట్టి
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్న భట్టి, కమల్‌రాజ్‌

ముదిగొండ/మధిర అక్టోబరు 29: వరి రైతులను ఆదుకోవాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌లు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో వరి పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయమని ప్రకటించటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, వారికి భరోసా కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో సాగర్‌ ఆయకట్టు కింద ఎక్కువ మొత్తంలో వరి సాగవుతుందని ఆరైతుల పంటను కొనుగోలు చేసేందుకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే జడ్పీచైర్మన్‌ కమల్‌రాజ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసి అప్పులపాలవుతున్నారని వారిని ఆదుకోవడానికే కల్యాణలక్ష్మీ పథకానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సామినేని హరిప్రసాద్‌, జడ్పీటీసీ పసుపులేటి దుర్గ, వైస్‌ఎంపీపీ మంకెన దామోదర్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ పోట్ల వెంకటప్రసాద్‌, సర్పంచ్‌ మందరపు లక్ష్మీ, ఎంపీటీసీ బలంతు జయమ్మ, డిప్యూటీ తహసీల్దార్‌ కరుణాకర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆయా పార్టీల నాయకులు రాయల నాగేశ్వరరావు, కొమ్మినేని రమే్‌షబాబు, వాచేపల్లి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌

మధిర: ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కులు శుక్రవారం మధిరలో సీఎల్పీనేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజుతో కలిసి పంపిణీ చేశారు. మధిర మండలంలోని పలు గ్రామాలకు చెందిన 46మంది లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఒక్కొ చెక్కు రూ.1,00,116లు విలువ కలిగిన చెక్కులు భట్టి విక్రమార్క, లింగాల కమల్‌రాజులు లబ్దిదారులకు అందజేశారు.  తహసీల్దార్‌ సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, ఏఎంసీ చైర్మన్‌ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-30T05:05:39+05:30 IST