రామాలయ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2021-11-10T04:57:06+05:30 IST

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్న దాన పథకానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డి.రాంధన్నపనేని వసంతరావు, శోభ దంపతులు మంగళవారం రూ.1,00,116 విరాళంగా అందించారు.

రామాలయ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
విరాళం అందజేస్తున్న దృశ్యం

భద్రాచలం,నవంబరు9: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నిత్యాన్న దాన పథకానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన డి.రాంధన్నపనేని వసంతరావు, శోభ దంపతులు మంగళవారం రూ.1,00,116 విరాళంగా అందించారు.  ముందుగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యన్నదాన పథకానికి విరాళాన్ని దేవస్థానం ఈవో బి.శివాజీకి అందించారు.  

 సుదర్శన చక్రం బహూకరణ

ఏన్కూరు, నవంబరు9: మండలంలోని గార్లొడ్డు లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి మంగళవారం హైదరాబాద్‌కు చెందిన దొరబాబు, వసంత దంపతులు సుమారు రూ.85వేల విలువైన సుదర్శన చక్రాన్ని బహూకరించారు. ఇది సుమారు 45 కేజీల బరువు ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దేవాలయంలో ఈ సుదర్శన చక్రంతోపాటు నాగప్రతిష్ట, గోశాల నిర్మాణాలు జరుగుతాయన్నారు. గతంలో దొరబాబు దంపతులు కల్యాణకట్టకు రూ.45వేలు, ఆలయ ప్రాంగణంలో మట్టి తోలకానికి రూ.1.25లక్షలు, వెండి వస్తువుల తయారీకి రూ.25వేలు అందించారు. దేవాలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని దొరబాబు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్‌ సూర్యప్రకాశరావు, అర్చకులు బీటుకూరి నాగరాజాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కిరణ్‌కుమార్‌ చార్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T04:57:06+05:30 IST