దివ్యాంగులు.. స్ఫూర్తిగా నిలుస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-08T05:18:49+05:30 IST

నేటి సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తూ... సమాజానికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కొనియాడారు.

దివ్యాంగులు.. స్ఫూర్తిగా నిలుస్తున్నారు
దివ్యాంగులకు పరికరాలు అందిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌

 కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

బీహెచ్‌ఈఎల్‌ సౌజన్యంతో 

 సహాయ ఉపకరణల పంపిణీ

ఖమ్మంఖానాపురంహవేలి, అక్టోబరు7: నేటి సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాలలో రాణిస్తూ... సమాజానికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కొనియాడారు. బీహెచ్‌ఈఎల్‌ సౌజన్యంతో జిల్లా స్ర్తీ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన దివ్యాంగుల సహాయ ఉపకరణల పంపిణీని కలెక్టర్‌ ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక శిబిరాల ద్వారా ఎంపిక చేసిన సుమారు 200మంది దివ్యాంగులకు రూ.24లక్షల విలువైన 443 సహాయ ఉపకరణాలను బీహెచ్‌ఈఎల్‌ అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ వసంత్‌రాయ్‌ జాదవ్‌తో కలిసి కలెక్టర్‌ లబ్ధిదారులకు అందించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ తనకు వచ్చిన లాభాల్లో కొంతభాగం వాటాను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సుబులిటి కింద అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు, సహజ జీవితానికి తోడ్పాటుగా ఉంటాయన్నారు. దివ్యాంగులు తమరోజువారి కార్యక్రమాలతోపాటు వివిధ రంగాల్లోరాణిస్తున్నారని, ఇటీవల దివ్యాంగులకు జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో సాధారణ క్రీడాకారులకంటే అధికంగా దివ్యాంగుల క్రీడాకారులు 200మెడళ్లు సాధించారని గుర్తు చేశారు. విగలాంగత్వం ఉందని నిరాశపడకుండా , తపన, పట్టుదల, కృషితో అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ తెలిపారు. బీహెచ్‌ఈఎల్‌ అడిషనల్‌ జీఎం వసంతరావ్‌జాదవ్‌ మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఏదైనాసాధించవచ్చన్నారు. సమాజంలోని దివ్యాంగులకు సహాయపడేందుకు కార్పొరేట్‌ సొషల్‌ రెస్పాన్స్‌బులిటి కింద బీహెచ్‌ఈఎల్‌ ఈ సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు 51ట్రైసైకిళ్లు, 26వీల్‌చైర్లు, 19రోలెటర్స్‌, 130క్రెచస్‌, 136వినికిడి పరికరాలు, తోపాటు వివిధర కాల ఉపకరణాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సంధ్యారాణి, బీహెచ్‌ఈఎల్‌ మేనేజర్‌ రాజేష్‌, ఐసీడీఎస్‌ అధికారులు, పాల్గొన్నారు.


Updated Date - 2021-10-08T05:18:49+05:30 IST