టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేతలు

ABN , First Publish Date - 2021-08-11T05:24:07+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిని వివిధ జిల్లాల పార్లమెంట్‌ కమిటీ నాయకులు మంగళవారం కలిశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేతలు

ఖమ్మం మామిళ్లగూడెం,ఆగస్టు10: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినిని వివిధ జిల్లాల పార్లమెంట్‌ కమిటీ నాయకులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నేతలు, పార్టీ స్థితిగతులను వివరించారు. జిల్లా నుంచి పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, కేతినేని హరీష్‌ ఆధ్వర్యంలో నాయకులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T05:24:07+05:30 IST