పేద విద్యార్థులకు ట్రైసైకిళ్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-08T05:36:38+05:30 IST

అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ కమలా హరీప్‌ తల్లి కమలాగోపాలన్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పాల్వంచలోని కమలాగోపాల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా ట్రై సైకిళ్ళు రగ్గులు పంపిణీ చేసారు.

పేద విద్యార్థులకు ట్రైసైకిళ్ల పంపిణీ
ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తున్న దృశ్యం

పాల్వంచటౌన్‌, డిసెంబరు 7: అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ కమలా హరీప్‌ తల్లి కమలాగోపాలన్‌ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పాల్వంచలోని కమలాగోపాల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచితంగా ట్రై సైకిళ్ళు రగ్గులు పంపిణీ చేసారు. పట్టణంలోని హెచ్‌ కన్వెన్షన్‌ హాల్‌ ప్రాంగణంలో కేక్‌ కట్‌ చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ ప్రముఖులు జాలె జానకిరెడ్డి, ఎంఈవో శ్రీరామ్మూర్తిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌వీకేఎస్‌ రాష్ట్ర సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చారుగుండ్ల రమేష్‌, ఓసీ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సందుపట్ల శ్రీనివాసరెడ్డి, న్యాయవాది తుమ్మల శివారెడ్డి,  సాదం రామకృష్ణ, కట్టా మల్లికార్జున్‌, బాలినేని నాగేశ్వరావు, సాధిక్‌పాషా, తోట కోటేశ్వరావు, శ్రినిషారెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాస్‌, మాధవి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:36:38+05:30 IST