మార్పులు, చేర్పుల కోసం ఎదురుచూపు
ABN , First Publish Date - 2021-02-27T04:59:04+05:30 IST
మార్పులు, చేర్పుల కోసం ఎదురుచూపు

ధరణిలో ఆప్షన్ లేకపోవడంతో రైతుల అవస్థలు
‘పెండింగ్’ పరిష్కారం కోసం పడిగాపులు
అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న అన్నదాతలు
బోనకల్, ఫిబ్రవరి 26: రెవెన్యూశాఖలో సంస్కరణలు తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణిలో మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వకపోవ డంతో రైతులు పెండింగ్ సమస్యలతో సతమతమవుతున్నారు. గతంలో కొందరు అధి కారుల నిర్లక్ష్యంతో ఒకరి భూమిని మరొకరి పేరున రికార్డుల్లో నమోదుచేయటంతో అసలు భూయజమానులు తమ భూమి నమోదును సరిచేయించుకోవటానికి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్‌కార్డులను అప్డేట్ చేసే క్రమంలో ఒక రైతుకు బదులుగా మరొక రైతు ఆధార్నెంబర్ను కంప్యూటరీకరణ చేయటంతో బోనకల్ గ్రామానికి చెందిన గోంగూర వెంకటేశ్వరరావుకు చెందిన రెండెకరాల భూమిని అదే గ్రామానికి చెందిన మరో రైతు సాగర్ల వెంగళరావు పేరిట ఎక్కించారు. దీనిని సరి చేయించుకొనేందుకు వెంకటేశ్వరరావు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా ధరణిలో సవరణ చేసే ఆప్షన్ లేకపోవడంతో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో వెంకటేశ్వరరావు వేరే వ్యక్తికి రికార్డుల్లో ఎక్కిన భూమిని తనపేరుమీదుగా మార్చు కొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకొనేందుకుగానూ రూ.30వేలు ఆన్లైన్ చలానా చెల్లిం చాడు. ఇలా పలు గ్రామాల్లోని కొందరి రైతుల పొలాలు వేరే వ్యక్తుల పేరుమీద రావడం తో వాటిని సరిచేయించుకొనేందుకు రూ.వేలకు వేలు ఖర్చుచేయాల్సి వస్తోంది. దీనికి తోడు కొన్నిగ్రామాల్లో తప్పును సరిచేసేందుకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాలంటే తాము రామని మొండికేస్తుండటంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండ గా రైతుల భూములకు సంబంధించి హెచ్చుతగ్గులను సరిచేయించుకొనేందుకు రెవెన్యూ కార్యాలయానికి వచ్చినా తమ చేతిలో ఏమీలేదని, ధరణి వెబ్సైట్లో ఆప్షన్ లేదని చెప ుతుండటంతో అన్నదాతలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల కొరకు ధరణి సైట్లో చేర్పులు, మార్పుల ఆప్షన్‌ను ఇచ్చి తప్పుడు వివ రాలను సరిచేసేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని రైతులు కోరుతున్నారు.