నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి

ABN , First Publish Date - 2021-11-27T04:26:18+05:30 IST

ఎన్‌సీసీ శిక్షణ ద్వారా క్యాడెట్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని 11 తెలంగాణా ఎన్‌సీసీ బెటాలియన్‌ కమాండెంట్‌ లెప్టెనెంట్‌ కల్నల్‌ సమిత్‌కార్కి పేర్కోన్నారు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి
గౌరవ వందనం సమర్పిస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

 లెప్టెనెంట్‌ కల్నల్‌ సమిత్‌కార్కి

ఖమ్మం స్పోర్ట్స్‌, నవంబరు 26: ఎన్‌సీసీ శిక్షణ ద్వారా క్యాడెట్లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని 11 తెలంగాణా ఎన్‌సీసీ బెటాలియన్‌ కమాండెంట్‌ లెప్టెనెంట్‌ కల్నల్‌ సమిత్‌కార్కి పేర్కోన్నారు. శుక్రవారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఈ శిక్షణ తీసుకున్న వానే  ఇతర విద్యార్థుల కంటే మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. వారిలో లీడర్‌ షిప్‌ క్వాలిటీ ఎక్కువగా ఉంటుందన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ క్యాంప్‌లో క్యాడెట్లు క్రమశిక్షణతో శిక్షణ తీసుకోవాలని అన్నారు. అంతకు ముందు జరిగిన కార్యక్రమంలో ఎన్‌సీసీ క్యాడెట్లు కమాండింగ్‌ అధికారి సమిత్‌కార్కికి గౌరవ వందనం (గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌) సమర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జకీరుల్లా, ఎన్‌సీసీ అధికారులు మురుగేశన్‌, రమణారావు, సంపత్‌, జరుపుల రమేష్‌, శ్రీలత, శైలజాబేగం ఉన్నారు.

Updated Date - 2021-11-27T04:26:18+05:30 IST