దివ్వెల దీపావళి

ABN , First Publish Date - 2021-11-03T04:23:09+05:30 IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీపావళి వేడుకలు జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటి కే బాణసంచా దుకాణాలు

దివ్వెల దీపావళి

 రేపు  వెలుగుల పండుగ 

 ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్న దేవాలయాలు 

  బాణసంచా కొనుగోళ్లలో  ప్రజలు బిజీ బిజీ 

ఖమ్మం ఖానాపురం హవేలీ/ కొత్తగూడెం సాంస్కృతికం, నవంబరు 2:  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీపావళి వేడుకలు జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇప్పటి కే బాణసంచా దుకాణాలు ఏర్పాటవుతుండటంతో కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. కాగా తక్కువ శబ్ధం వచ్చే బాణసంచానే కాల్చాలని, పర్యావరణాన్ని కాపాడే విధంగా గ్రీనక్రాకర్స్‌నే కాల్చాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు. కాగా ఇప్పటికే జిల్లాలోని అన్ని దేవాల యాలను రంగులు వేసి, ప్రత్యేక పూజల కోసం ముస్తాబు చేశారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వ దినం వస్తుంది. 4వతేదీ గురు వారం వెలుగుల పర్వదినాన్ని ప్రజలు జరుపుకోనున్నారు. 

దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే..

రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకిం చిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవత రించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం.  

ధనత్రయోదశి..

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధన లక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్థలతో కొలుస్తారు. బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందం టారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.  

ధన్వంతరి జయంతి..

ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి మహాభాగ్యానికి అవసరమైన ఔషధకర్త ధన్వంతరి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం లాంటి దివ్యశక్తుల తోపాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి తరలివచ్చాడు. అందుకే ఆరోగ్యం కోసం, అనారోగ్యాల నుంచి శీఘ్ర ఉపశమనం కలగడానికి ఈ రోజు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధన్వంతరి కూడా శ్రీమన్నారాయణుని అంశ అని.. ఆయనను పూజిేస్త లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని అంటారు. అందుకే ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పుడు ధన్వంతరిని స్మరించుకుంటారు. ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కూడా ఇస్తుంది.

దీపావళి అమావాస్య..

ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాల య అమావాస్య, రెండు దీపావళి.  సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగీంచి, గుమ్మా ల్లో నేల మీద కొడుతూ... ‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ! అని పాడ తార 

మార్కెట్లో దీపావళి కళ

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కడా చూసినా దీపావళి సందడే కనిపి స్తోంది. మార్కెట్లన్నీ వినియోగదార్ల తో కిటకిట లాడుతున్నాయి. పండగ సామగ్రి కొనుగోలుకు సంబంధించి విక్రయాలు జోరందుకున్నాయి. 

 ఒకప్పుడు వ్యవసాయరంగంలో గ్రీన్‌ రెవెల్యూషన్‌ తీసుకొచ్చినట్లు.. ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌లో కూడా రెవెల్యూషన్‌ వచ్చింది. అవే గ్రీన కాకర్స్‌. మనం వాడే క్రాకర్స్‌ కాలుష్యరహితమైనవి కాదు. సీఎస్‌ఐఆర్‌ అంటే కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ర్టియల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు కాలుష్యరహిత టపాసుల తయారీని పేర్కొన్నారు. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి చాలా రాష్ర్టాలు బాణసంచా వాడకాన్ని నిషేధించాయి. అయినప్పటికీ, అనేక రాష్ర్టాల ప్రజలు సాధారణ బాణసంచా గ్రీన్‌ క్రాకర్లను కాల్చడానికి మరియు విక్రయించడానికి కూడా అనుమతిస్తున్నాయి.  

ప్రమాద రహితం 

 అతి తక్కువ హానికర రసాయనాలతో తయారుచేేస ప్రమాదరహిత బాణాసంచాలను గ్రీన్‌ కాకర్స్‌ అంటారు. ఇందులో రసాయన ఫార్ములా వల్ల పేలిన తర్వాత నీటి అణువులు ఉత్పత్తి అవుతాయి. ఇది గాల్లో ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ధూళిని గ్రహిస్తాయి. గాల్లో ఉండే నైట్రాక్సైడ్‌, సల్ఫర్‌ ఆక్సైడ్‌లను 30-35ు తగ్గిస్తుంది. తక్కువ ఉద్గారాలతో ఉత్పత్తితో లైటింగ్‌, శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. వాటిని ఉపయోగిస్తే మంచిది.

Updated Date - 2021-11-03T04:23:09+05:30 IST