రుణమాఫీ హామీని వెంటనే అమలుచేయాలి: కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-10-22T05:19:03+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన పూర్తి రుణమాఫీహామీని వెంటనే అమలుచేయాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు.
మధిర/మధిరరూరల్, అక్టోబరు 21: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన పూర్తి రుణమాఫీహామీని వెంటనే అమలుచేయాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం మధిర కాంగ్రె్‌సపార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. మధిరలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి పేదలకు అందజేయాలని, మహదేవపురం లిప్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని, మధిర చెరువుకట్ట పనులు అసంపూర్తిగా అధ్వానంగా ఉన్నాయని వెంటనే అసంపూర్తి నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
తూములూరి కుటుంబానికి పరామర్శ
మధిర రూరల్: మధిరలోని తూములూరి ఉపేంద్ర, రాజా తండ్రి పుల్లారావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పరామర్శించారు. పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణగుప్తా, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, నియోజకవర్గ, మండల యూత్ అధ్యక్షులు తూమాటి నవీన్‌రెడ్డి, అద్దంకి రవికుమార్, నాయకులు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు, గంగుల నరసింహయాదవ్, షేక్.జంగీర్, షేక్.బాజీ, బండారు నర్సింహారావు, ఆదిమూలం శ్రీనివాస్, మైలవరపు చక్రీ పాల్గొన్నారు.