వివాహ వేడుకలో అపశ్రుతి

ABN , First Publish Date - 2021-12-27T05:29:03+05:30 IST

ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ మర్రిగూడెంలో ఆదివారం జరిగిన వివాహా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.

వివాహ వేడుకలో అపశ్రుతి

విద్యుదాఘాతంతో డెకరేషన్‌ చేస్తున్న యువకుడి దుర్మరణం

ఇల్లెందురూరల్‌/ ఇల్లెందు టౌన్‌ డిసెంబరు 26: ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ మర్రిగూడెంలో ఆదివారం జరిగిన వివాహా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పెళ్లికి డెకరేషన్‌ చేస్తూ విద్యుత్‌ షాక్‌ గురై ఇల్లెందు పట్టణానికి చెందిన వానరాసి శ్రీనివాస్‌(18) అనే యువకుడు మృతి చెందాడు. మర్రిగూడెంలో ఓ వివాహ వేడుకకు డెకరేషన్‌ వేసేందుకు ఓ వ్యక్తి కాంట్రాక్ట్‌ మాట్లాడుకున్నాడు. అతడి వద్ద రోజూ కూలీగా పనికి శ్రీనివాస్‌ వచ్చాడు. ఈక్మంలో విద్యుత్‌ దీపాలకు డెకరేషన్‌ చేస్తుండగా షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు హు టాహుటిన  శ్రీనివాస్‌ను ఇల్లెందు ప్రభుత్వ అసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతు మృతి చెందాడు. శ్రీనివాస్‌ తండ్రి తండ్రి వెంకన్న 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త,కుమారుడు 15రోజుల వ్యవధిలో మృతి చెందడంతో తల్లి సమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. శ్రీనివాస్‌ మృతిపై కొమరారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

15 రోజుల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి

పట్టణంలోని 3వవార్డుకు చెందిన వానరాసి వెంకన్న(59) మునిసిపాలిటిలో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 15రోజుల క్రితమే మృతిచెందాడు. వెంకన్నకు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకన్న కుమారుడు శ్రీనివాస్‌(18) ఆదివారం మండల పరిధిలోని మర్రివాగులో డేకరేషన్‌ పనులు నిర్వహిస్తు ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. రెక్కాడితేనే డొక్కాడని వరసగా మరణాలు సంభవించడంతో దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. సమాచారం తెలుసుకున్న ఇల్లెందు మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాల పాటివెంకటే శ్వర్‌రావు మృతదేహానికి ప్రభుత్వ వైద్యశాలలో నివాళులు అర్పించారు. దహనసం స్కారాల నిమిత్తం రూ.5వేలు అందించారు. 

Updated Date - 2021-12-27T05:29:03+05:30 IST