పిండి మిల్లులో చీరపడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-08-20T05:31:48+05:30 IST

ప్రమాదపుశాత్తు పిండి మిల్లులో చీరపడి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగింది.

పిండి మిల్లులో చీరపడి మహిళ మృతి

బూర్గంపాడు, ఆగస్టు 19: ప్రమాదపుశాత్తు పిండి మిల్లులో చీరపడి మహిళ మృతి చెందిన  సంఘటన గురువారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగింది.  లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ(65) దంపతులు పిండి మిల్లు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం పిండిపడుతున్న క్రమంలో చౌడమ్మ చీర ప్రమాదపుశాత్తు మిల్లులో చీర పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను భద్రాచలం తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ జితేందర్‌ తెలిపారు.


Updated Date - 2021-08-20T05:31:48+05:30 IST