కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర
ABN , First Publish Date - 2021-05-09T04:37:20+05:30 IST
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభిస్తుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. మండల పరిధిలోని గుంపెనలో సహకారసంస్ధ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరీశీలించారు.

డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
అన్నపురెడ్డిపల్లి, మే 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర లభిస్తుందని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. మండల పరిధిలోని గుంపెనలో సహకారసంస్ధ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరీశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీగింజను కొంటా మన్నారు. తరుగుపేరుతో క్వింటాకు 5 కేజీలు మిల్లర్లు తీసుకుంటున్నారని రైతులు ఫిర్యాదు చేయటంతో స్పందించిన ఆయన కొత్తగూడెం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో ఫోన్‌లో మాట్లాడారు. కార్యక్రమంలో సీఈవో వీరబాబు, జియం హనుమంతరావు, గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ పాల్గొన్నారు.