దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

ABN , First Publish Date - 2021-10-07T17:08:01+05:30 IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీ గా నిలుస్తున్న దసరా పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని కొత్తగూడెం ఆర్టీసీ డీవీఎం శ్రీ కృష్ణ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

కొత్తగూడెం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీ గా నిలుస్తున్న దసరా పండుగ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని కొత్తగూడెం ఆర్టీసీ డీవీఎం శ్రీ కృష్ణ తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడారు. భద్రాద్రి ఆర్టీసీ దసరా పండుగకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు 196 బస్‌ సర్వీసులు హైదరాబాద్‌ నుంచి భద్రాద్రి జిల్లాకు నడుపుతున్నామని, తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు భద్రాద్రి జిల్లా నుంచి ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 194 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి బస్‌సర్వీసులను నడిపిస్తూ ప్రయాణీకుల సౌకర్యార్థం అందుబాటులోకి ఉంచామని తెలిపారు. ప్రతి బస్టాండ్‌లో ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, సిబ్బందితో ప్రయాణీకులకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామన్నారు. కొత్తగూడెం డిపో నుంచి 65, భద్రాచలం 80, మణుగూరు 51 బస్సులు పండుగ సందర్భంగా నడుపనున్నట్లు తెలిపారు. ఈ బస్సు సర్వీసు అన్ని రూట్లకు రిజర్వేషన్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. 


Updated Date - 2021-10-07T17:08:01+05:30 IST