లోక కల్యాణం కోసమే సైకిల్‌యాత్ర

ABN , First Publish Date - 2021-12-08T05:15:25+05:30 IST

ప్రజాహితం, గోవుల సంక్షేమం కోసం భద్రాచలం నుంచి ఢిల్లీ వరకు భారతీయ సంత్‌ మహారాజ్‌ సీనియర్‌ జర్నలిస్టు స్వామిపొన్నాల గౌరీశంకర్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం తల్లాడ చేరుకుంది.

లోక కల్యాణం కోసమే సైకిల్‌యాత్ర

తల్లాడ, డిసెంబరు 7: ప్రజాహితం, గోవుల సంక్షేమం కోసం భద్రాచలం నుంచి ఢిల్లీ వరకు భారతీయ సంత్‌ మహారాజ్‌ సీనియర్‌ జర్నలిస్టు స్వామిపొన్నాల గౌరీశంకర్‌ చేపట్టిన సైకిల్‌యాత్ర మంగళవారం తల్లాడ చేరుకుంది. అయ్యప్పభక్తులు సైకిల్‌యాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరీశంకర్‌ మాట్లాడుతూ హరితహారం సాధన కోసం ఏడుసంవత్సరాలుగా సైకిల్‌యాత్ర కొనసాగుతుందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేయాలని, జర్నలిస్టు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలాలు ఇప్పించాలని కోరారు.


Updated Date - 2021-12-08T05:15:25+05:30 IST