విద్యుత్‌ తీగలు తగిలి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-21T05:20:56+05:30 IST

వ్యవసాయపనులకు వెళుతున్న ఓ యువకుడు ఓ పొలంలో తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో శుక్రవారం జరిగింది.

విద్యుత్‌ తీగలు తగిలి యువకుడి మృతి

మధిర రూరల్‌, ఆగస్టు 20: వ్యవసాయపనులకు వెళుతున్న ఓ యువకుడు ఓ పొలంలో తెగిపడిన విద్యుత్‌ తీగలు తగిలి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో శుక్రవారం జరిగింది. ఇల్లెందులపాడు గ్రామానికి చెందిన కొంగల సామేలు(24)వ్యవసాయ పనులు చేస్తుంటాడు. శుక్రవారం ఉదయం తన మిత్రులతో కలిసి ఇల్లెందులపాడు గ్రామసమీపంలోని పొలాల్లో పనులు చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఓ సుబాబుల్‌ పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో సామేలు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతిచెందాడు. అతడి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యవైఖరే సదరు యువకుడి ప్రాణాన్ని బలిగొందని స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇల్లెందులపాడు ప్రాంతంలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ తీగలు, స్తంభాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని రైతులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాలవైపు వెళ్లాలంటే భయమేస్తోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-08-21T05:20:56+05:30 IST