కరెంట్‌ షాక్‌తో కానరాని లోకాలకు

ABN , First Publish Date - 2021-08-20T05:32:50+05:30 IST

కుటుంబ పోషణకోసం తల్లికుమారుడు బంధువులతో కూలి పనికి వెళ్లగా కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన గురువారం భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంటలో జరిగింది.

కరెంట్‌ షాక్‌తో కానరాని లోకాలకు
ఆటోలో తల్లి ఒడిలో మృతుడు చింతల రాజు

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

తల్లి ఎదుటే ప్రమాదం.. పిల్లర్లు కూలుస్తుండగా ఘటన

అన్నపురెడ్డిపల్లి, ఆగస్టు 19: కుటుంబ పోషణకోసం తల్లికుమారుడు బంధువులతో కూలి పనికి  వెళ్లగా కుమారుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన గురువారం భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంటలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజాపురం గ్రామానికి చెందిన తల్లితో పాటు కుమారుడు చింతల రాజు(32) యర్రగుంటలో పాత ఇంట్లో పిల్లర్లు కూలగొట్టే పనికి వెళ్లారు. ఈ క్రమంలో పిల్లర్లు పగలగొట్టేందుకు డ్రిల్లింగ్‌ చేస్తుండగా రాజు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. వెంటనే తోటి కూలీలు అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి రోదన పలువురిని కంటతడి పెట్టించింది. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-20T05:32:50+05:30 IST