ప్రజా పోరాటాలకు దిక్సూచి సీపీఎం

ABN , First Publish Date - 2021-12-31T04:33:05+05:30 IST

సీపీఎం జిల్లా ద్వితీయ మహాసభలు అశ్వారావుపేటలో వచ్చే నెల 4, 5 తేదీల్లో జరుగుతాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రకటించారు.

ప్రజా పోరాటాలకు దిక్సూచి సీపీఎం
మాట్లాడుతున్న కనకయ్య

4,5 తేదీల్లో అశ్వారావుపేటలో జిల్లా సభలు 

హాజరు కానున్న తమ్మినేని, పోతినేని సుదర్శన్‌ 

పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య వెల్లడి

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, డిసెంబరు 30: సీపీఎం జిల్లా ద్వితీయ మహాసభలు అశ్వారావుపేటలో వచ్చే నెల 4, 5 తేదీల్లో జరుగుతాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రకటించారు. గురువారం మంచి కంటి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న అన్నివర్గాల ప్రజల సమస్యల సాధనకై రాజీలేని పోరాటాలు నిర్వహించామని తెలిపారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయా లని, డబుల్‌బెడ్‌రూం ఇవ్వాలని, ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మె సందర్భంగా జరిగిన మహత్తర పోరాటలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించామన్నారు. సీపీఎం జాతీయ నా యకులు బృందా కారత్‌, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ ద్రం ప్రత్యక్ష పోరాటాలకి నాయకత్వం వహించిన తీరు అద్భుతమని గుర్తు చేశారు.  మహిళా హక్కుల కోసం, మైనార్టీలపై ప్రభుత్వ మతపరమైన దాడులను నిరసిస్తూ సమైక్య నినాదంతో ప్రత్యక్ష కార్యాచరణలు, కార్మిక, రైతాంగ పోరాటాలు, సంఘటిత రంగంలో, అసంఘటిత రంగంలో కీలకమైన ఉద్యమాలు నిర్వహించామన్నారు. ప్రజాసేవ కా ర్యక్రమాల్లో మానవత్వాన్ని చాటిన అనేక సేవా కార్యక్ర మాలు చేసిన ఘనత సీపీఎంకే దక్కిందని తెలిపారు.  కరో నా సమయంలో ప్రభుత్వాలు చేయలేని పనులు సీపీఎం కార్యకర్తలు నిర్వహించారని కొనియాడారు. ఐసోలేషన్‌ సెంటర్లు, కరోనా పేషెంట్లకు భోజనాలు, మృతదేహాలకు దహన సంస్కారాలు వంటి సాహసోపేతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజాపోరాటాలతో, సేవా కార్యక్రమాల ద్వారా సీపీఎం జిల్లాలో మరిం త నిర్ణయాత్మక పాత్ర పోషించేలా ఈ మహాసభల్లో చర్చించబోతున్నట్లు తెలిపారు. ప్రజా పోరాటాలకు సీపీఎం దిక్సూచిలా నిలిచిందని అన్నారు. పేద ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించిన ఘనత సీపీఎంకు దక్కిందని అ న్నారు. అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి ప్రజ లకు న్యాయం జరిగేలా చేశామని అన్నారు. రానున్న కాలంలో నిర్వహించాల్సిన పోరాటాలు, ప్రభుత్వాలు అవలంభి స్తున్న విధానాలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌ హాజరుకాను న్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, నాయకులు మచ్చ వెంకటే శ్వర్లు, ఏజే రమేష్‌, గుగులోత్‌ ధర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T04:33:05+05:30 IST