పేదలకు అండగా ఎర్రజెండా ఉంటుంది

ABN , First Publish Date - 2021-12-09T03:51:56+05:30 IST

దోపిడీ ఉన్నంతకాలం పేదల పక్షాన ఎర్రజెండా అండగా ఉంటుందని, పెట్టుబడి దారీ విధా నానికి ప్రత్యామ్నాయమే కమ్యూనిజం అని సీపీఎం రాష్ట్ర నేత పి.సోమయ్య అన్నారు.

పేదలకు అండగా ఎర్రజెండా ఉంటుంది
మాట్లాడుతున్న సోమయ్య

సీపీఎం రాష్ట్ర నేత సోమయ్య

సుజాతనగర్‌, డిసెంబరు 8: దోపిడీ ఉన్నంతకాలం పేదల పక్షాన ఎర్రజెండా అండగా ఉంటుందని, పెట్టుబడి దారీ విధా నానికి ప్రత్యామ్నాయమే కమ్యూనిజం అని సీపీఎం రాష్ట్ర నేత పి.సోమయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీ ఎం కార్యాలయంలో మండల కార్యదర్శి వీర్ల రమేష్‌ అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు సో మయ్య ముఖ్య అఽతిధిగా హాజరై తరగతులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కాలంలో ప్రజలను దోచుకుని తిన్నాయని, కాని కమ్యూనిస్టు దేశాలు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ వారికి అండగా ఉన్నాయని అన్నారు. కరోనా కాలంలో భారతదేశంలో 40 లక్షల మంది వైద్యం అందక మరణిస్తే కేవలం 4 లక్షల మంది మాత్రమేనని నరేంద్రమోడీ తప్పుడు లెక్కలు చూపుతు న్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు తిరుపతిరావు, వీరబాబు, శారద, నాగరత్తమ్మ, సావిత్రి, ఈసం రమేష్‌, శ్రీను, నాగమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T03:51:56+05:30 IST