కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-02-02T05:07:47+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీహెచ్‌ఎం గ్రేడ్‌-2, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలని ఉపసంచాలకులు రమాదేవి అన్నారు.

కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలి
కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్న రమాదేవి

గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి

భద్రాచలం, ఫిబ్రవరి 1: ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీహెచ్‌ఎం గ్రేడ్‌-2, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ సజావుగా నిర్వహించాలని ఉపసంచాలకులు రమాదేవి అన్నారు. సోమవారం డీడీ కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీ హెచ్‌ఎం ఎల్‌ఎ్‌ఫఎల్‌ ఉపాధ్యాయ పదోన్నతుల కౌన్సిలింగ్‌ను ఏసీఎంవో రమణయ్య, భద్రాచలం ఏటీడీవో నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ను ఉద్దేశించి డీడీ రమాదేవి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌, పీవో గౌతమ్‌ సూచనలు, సలహాలు పాటిస్తూ సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏటీడీవో నరసింహారావు, సూపరింటెండెంట్‌ ప్రమీలాబాయి, ఏసీఎంవో రమణయ్య, బావ్‌సింగ్‌, డీడీ కార్యాలయ సెక్షన్‌ అసిస్టెంటు నారాయణ, నాగమణి, భద్రు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T05:07:47+05:30 IST