తెల్ల బంగారం ధగధగ

ABN , First Publish Date - 2021-10-08T05:20:43+05:30 IST

తెల్ల బంగారం ధగధగ

తెల్ల బంగారం ధగధగ
ఖమ్మం మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను పరిశీలిస్తున్న మార్కెట్‌ చైర్‌పర్సన్‌, సెక్రెటరీ

ఖమ్మం మార్కెట్‌లో క్వింటా రూ.7,500

ఖమ్మం మార్కెట్‌, అక్టో బరు 7: తెల్లబంగారం (పత్తి) ధగధగలాడుతోంది. ఖమ్మం నగరంలోని వ్యవ సాయ మార్కెట్‌లో రికార్డు ధర లభించింది. ఖరీఫ్‌ (వానాకాలం సీజన్‌) కొత్త పత్తిని గురువారం వ్యాపా రులు క్వింటా రూ.7,500కు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా కొనుగోలు చేశారు. పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ.6,025ఉండగా దానికంటే సుమారు  రూ.1,500 అదనంగా ప్రైవేటు వ్యాపారులు ఖరీదు చేయడం విశేషం. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్‌ అయిన వరంగల్‌ ఎనుపాముల మార్కె ట్‌లో క్వింటా రూ.7,235 ధర పలకగా ఖమ్మం మార్కెట్‌లో అంతకన్నా ఎక్కువగా ధర పలకడం మరో విశేషంగా వ్యాపారులు, మార్కెట్‌ అధి కారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో కొత్త పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటుందని వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారని, కానీ ప్రస్తుతం తేమ శాతం ఎక్కువగా ఉన్నా అధిక ధరలకు కొను గోలు చేయడం పత్తి రైతులకు మేలు చేసే అంశమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో తమ పత్తికి అధిక ధరలు లభించ డంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మార్కెట్‌కు గురు వారం సుమారు 2వేల పత్తి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. పత్తి కొనుగోళ్లను మార్కెట్‌ చైర్‌పర్సన్‌ డౌలె లక్ష్మీప్రసన్న సాయికిరణ్‌, మార్కెట్‌ సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశం, అసిస్టెంట్‌ సెక్రెటరీ రాజేంద్ర ప్రసాద్‌, యూడీసీ శ్రీనివాస్‌, దిగుమతి శాఖ అధ్యక్షుడు దిరిశాల వెంక టేశ్వర్లు, సెక్రెటరీ బజ్జూరి రమణారెడ్డి, తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-10-08T05:20:43+05:30 IST