పైసాతోనే పని... భద్రాద్రి జిల్లా విద్యాశాఖలో షాడోలు.. సూడోలు
ABN , First Publish Date - 2021-01-21T05:08:22+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలో విలువైన సేవలను అందించి పదవి విరమణ(రిటైర్డ్) చేసిన రోజునే వారిని గౌరవిస్తూ చివరిరోజున రావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుతూ, అన్ని సెటిల్ చేసి ఇంటివరకు ప్రభుత్వ వాహనంలో పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

రిటైర్ అయ్యి ఆరు నెలలైనా అందని పెన్షన్
లంచం ఇవ్వలేదని సాగదీస్తున్న వైనం
ఓ విశ్రాంత ఎంఈవో ఆవేదన
కొత్తగూడెం కలెక్టరేట్, జనవరి 20: ప్రభుత్వ ఉద్యోగులు తమ జీవితంలో విలువైన సేవలను అందించి పదవి విరమణ(రిటైర్డ్) చేసిన రోజునే వారిని గౌరవిస్తూ చివరిరోజున రావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుతూ, అన్ని సెటిల్ చేసి ఇంటివరకు ప్రభుత్వ వాహనంలో పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పదవీ విరమణ పొంది నెలలు గడుస్తున్నా ఇంత వరకు పెన్షన్, ఇతర ఆర్థిక సెటిల్‌మెంట్లు కాని ఉద్యోగులున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాశాఖలో లంచాలకు మరిగి కొంతమంది ఏజెంట్లుగా, బినామీలుగా, షాడోలుగా, సూడో లుగా వ్యవహరిస్తూ రిటైర్ అయినా కొందరు ఉద్యోగులకు కనీసం పెన్షన్‌కూడా సెటిల్ చేయని వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ సాక్షాలతో సేకరించింది. విద్యాశాఖలో కొంతమది జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకు కోటరీలుగా మారి ఆయా కేసులను సెటిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా విద్యాశాఖలో ఓ వ్యక్తి చక్రం తిప్పుతూ తనవారికోసం ఏదైనా చేస్తూ, కాదన్నవారిని వేధింపు లకు గురిచేస్తున్న వ్యవహారం ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయ నకు అనుగుణంగా ఉత్తర్వులు తెప్పించడం, బదిలీల విషయంలో కావాల్సిన జిల్లాకు బదిలీ చేయిం చడం, సస్పెన్షన్ల విషయం సెటిల్ చేయడం ఇలా అన్ని విషయాలు సెటిల్‌మెంట్లు ఫోన్‌ద్వారా నిర్వహించే అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. అందుకు ములకలపల్లి మండలం నకిరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయుడి సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది.
లంచం ఇస్తేనే తుది విచారణ..
ములకలపల్లి మండలం నకిరిపేట జిల్లాపరిషత్ పాఠశాలతో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసిన నంది వీరభద్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2014 జూలై నుంచి 2016జనవరి 4 వరకు ములకలపల్లి మండల విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వ హించాడు. ఆ సమయంలో ఆయనస్కూల్ అసిస్టెంట్‌కు ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు రాతపూర్వకంగా అప్పగించి ఎంఈవోగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలో 2015జూన్ 29న నకిరిపేట జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బియ్యం చోరీ సంఘటనలో ఎంఈవో వీరభద్రాన్ని బాధ్యు డిని చేస్తూ ఏడు నెలల తర్వాత 2016 జనవరి 5న సస్పెండ్ చేశారు. ఈ సంఘటనలో విద్యాశాఖలో షాడోగా, సూడోగా చక్రం తిప్పుతున్న ఓ సీనియర్ ప్రధానోపాధ్యాయుడు అప్పటి డిప్యూటీ డీఈవోకు రూ.లక్ష లంచం ఇస్తే అన్నీ సర్దుకుంటాయని మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. బియ్యం చోరీ కేసుపై అప్పటి తహ సీల్దార్ విచారణ చేసి ఈ విషయంలో ఎంఈవో వీరభద్రానికి ప్రమే యం లేదని నివేదిక సమర్పించారు. అయినా అడిగిన లంచం ఇవ్వలేదన్న కారణంగా 2016 జనవరి 5న తనను సస్పెండ్ చేశారని బాధితుడు వాపోయాడు. ఆ తర్వాత ఎంఈవో చేసిన అప్పీలుపై ఉన్నతాధికారులు అతడికి 2016మార్చి 3న అదే ప్రదేశంలో పోస్టు ఇచ్చారు. తరువాత అతడు 2020 జూన్ 30న ఉద్యోగ విరమణ చేశాడు. అయితే బియ్యం చోరీ ఘటనకు సంబంధించి తుది విచారణ పూర్తిచేయకుండా అధికారులు నేటికీ కాలయాపన చేస్తుండడంతో బాధితులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగవిరమణ అయిన తర్వాత పెన్షన్ కాగితాలను, ఇతర ప్రపో జల్స్ తీసుకొని డీఈవో కార్యాలయానికి వెళితే సస్పెన్షన్ విచారణ పెండింగ్‌లో ఉన్నందున ప్రపోజల్స్ పంపడం కుదరదని సదరు అధి కారి తిప్పి పంపాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రూ.లక్ష ఇస్తే పనవుతుందని సదరు షాడో అధికారి మధ్యవర్తిత్వం చేశాడని బాధితుడు ఆరోపించాడు. తనకు జరిగిన అన్యాయంపై ట్విట్టర్ లో గతేడాది నవంబరులో మంత్రి కేటీఆర్‌కు, విద్యాశాఖ మంత్రికి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆర్‌జేడీ, కలెక్టర్, డీఈవోలకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు. అయినా తన సస్పెన్షన్‌పై తుది విచా రణ జరగకపోవడం మానసిక క్షోభకు గురిచేస్తోందని బాధితుడు వాపోయాడు.
డీఈవో ఏమన్నారంటే
ఈ విషయమై డీఈవో సోమ శేఖర్‌శర్మను వివరణ కోరగా వీరభద్రం సస్పెన్షన్ విచారణను నెలాఖ రులోగా పూర్తిచేస్తామన్నారు. ట్విట్టర్‌లో లంచం విషయంపై చేసిన ఫిర్యాదుపై ఆయన మాట్లాడుతూ కేవలం రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేయలేకపోతున్నామని, ఆయన వద్ద బలమైన సాక్ష్యాలుంటే విచారణ చేస్తామన్నారు.