మాస్కులు, శానిటైజేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2021-03-25T05:11:55+05:30 IST
కరోన పునరావృతం అవుతోందని, ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ చల్లా ప్రసాద్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట పట్టణంలో తహసీల్దార్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి

అశ్వారావుపేట, మార్చి 24: కరోన పునరావృతం అవుతోందని, ప్రజలు, ముఖ్యంగా వ్యాపారులు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ చల్లా ప్రసాద్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట పట్టణంలో తహసీల్దార్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, సర్పంచ్ అట్టం రమ్య తదితరులు ప్రధాన వీధిలో సంచరిస్తున్న ప్రజలు, వ్యాపార సముదాయాలను కలియతిరుగుతూ పలు సూచనలు చేశారు. మార్కెట్‌లో వ్యాపారులు తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజేషన్‌ను పాటించాలని, దుకాణాలకు వచ్చే వారు వాటిని పాటించేలా చేయాలని, భౌతిక దూరం పాటించేలా చూసి కరోన వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా తప్పనిసరి అన్నారు. మాస్క్‌లు ధరించని వారికి సరుకులు కూడ ఇవ్వవద్దని సూచించారు. ప్రజలు కూడ వ్యక్తిగత శు భ్రతను, సామాజిక దూరాన్ని పాటించాలని, తప్పనిసరి అయితేగాని బజారుల్లోకి రావద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ సీతారామరాజు, పంచాయతీ ఈఓ హరికృష్ణ, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నిబంధనలతో ఉపాధి హామీ పనులు
మణుగూరు టౌన్, మార్చి 24 : మణుగూరు మండల పరిధిలోని రామానుజారం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాఽధిహామీ పనుల్లో కరోనా నివారణ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని రామానుజారం సర్పంచ్ బాడిస సతీష్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో భౌతిక దూరాన్ని పాటించిమా్‌స్కలు ధరించి శానిటైజర్లు వాడాలని సూచించారు. మాస్క్‌లు లేకుండా ఎవరినీ పనులకు హాజరు కానివ్వరాదని తెలిపారు. మధ్యాహ్నం లోపు కేటాయించిన పనులు పూర్తి చేసి ఇళ్లకు వెళ్లాలన్నారు. సకాలంలో కూలీల మస్టర్లను ఆన్‌లైన్ చేయాలని ఏపీవోకు తెలిపారు. ఈకార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రమేస్, బినం రంగయ్య, తదితరులుపాల్గొన్నారు.