వివాదంగా మారిన భవన నిర్మాణం

ABN , First Publish Date - 2021-10-08T05:22:08+05:30 IST

ఇల్లెందు పట్టణంలో హరిప్రియ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 120 గజాల స్ధలంలో నిర్మిస్తున్న భవనం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ వివాదస్పదంగా మారింది.

వివాదంగా మారిన భవన నిర్మాణం

 అభివృద్ధిని అడ్టుకుంటే సహించం: టీఆర్‌ఎస్‌ 

అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి: కాంగ్రెస్‌

ఇల్లెందు, అక్టోబరు7: ఇల్లెందు పట్టణంలో హరిప్రియ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 120 గజాల స్ధలంలో నిర్మిస్తున్న భవనం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నడుమ వివాదస్పదంగా మారింది. ఫౌండేషన్‌ పేరుతో ఎమ్మెల్యే స్ధలం కబ్జా చేసి భవనం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు... అభివృద్ధి పఽథకాలతో ఉనికి కోల్పోతున్నామన్న   దుష్పచారాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. హరిప్రియ ఫౌండేషన్‌ సభ్యులు పరుచూరి వెంకటేశ్వర్‌రావు, గుండాశ్రీకాంత్‌, జెకెశ్రీనివాస్‌, పెండ్యాల హరికృష్ణ, పివి కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొక్కునాగేశ్వరరావు తదితరులు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు చౌకబారు ప్రచారం కోసం ఎమ్మెల్యే దంపతులపై నిందారోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన టీఎస్‌ఐఐసీ, ఎంఎస్‌ఎంఈ, న్యాక్‌ శిక్షణ కార్యక్రమాలు అధికారుల సమన్వయం కోసం 120 గజాల స్ధలంలో నిర్మిస్తున్న కేంద్రం పూర్తిగా స్వచ్చంద సేవా కార్యక్రమాల కోసమేనని చెప్పారు. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే శిక్షణలకు వినియోగిస్తారని వివరించారు. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి సంస్ధ ఇల్లెందు పట్టణంలో మల్టీ యుటీలీటీ సెంటర్‌, అంబేద్కర్‌, గిరిజన భవనాలు, ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు నిర్మిస్తున్న భవనాల మాదిరిగానే నిరుద్యోగ శిక్షణ కేంద్రం నిర్మిస్తుండగా రాద్ధాంతం చేస్తున్నారని ఖండించారు. కాగా కాంగ్రెస్‌ టీపీసీసీ సభ్యులు జలీల్‌, చీమలవెంకటేశ్వర్లు, మండల అద్యక్షుడు పులిసైదులు తదితరులు పౌండేషన్‌ పేరుతో నిర్మిస్తున్న భవనాన్ని నిలిపివేయాలని గురువారం తహశీల్ధార్‌, మునిసిపల్‌ కమీషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఫౌండేషన్‌ పేరుతో స్ధలాలు కజ్జా చేశారని ఆరోపించారు.    పట్టణంలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుల నడుమ తలెత్తిన వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2021-10-08T05:22:08+05:30 IST