అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా

ABN , First Publish Date - 2021-12-31T05:18:07+05:30 IST

అసాంఘీక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని వైరా ఏసీపీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఏసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున వైరా, మధిర సీఐలు జె.వసంతకుమార్‌, ఓ.మురళీ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి వైరాలోని హనుమాన్‌బజార్‌లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు.

అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా

 వైరా ఏసీపీ స్నేహ మెహ్రా

వైరా, డిసెంబరు 30: అసాంఘీక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని వైరా ఏసీపీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. ఏసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున వైరా, మధిర సీఐలు జె.వసంతకుమార్‌, ఓ.మురళీ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి వైరాలోని హనుమాన్‌బజార్‌లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. కమ్యూనిటీ కనక్ట్‌ ద్వారా నేరరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. స్థానిక ప్రజలు ఎలాంటి అభద్రతాభావం లేకుండా నేరస్థుల కదలికలను కట్టడి చేసేందుకు తనిఖీలు దోహదం చేస్తాయన్నారు. ప్రజలు ఎలాంటి గొడవలకు పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నారు.   మాయగాళ్ల మాటలకు మోసపోవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు కానీ, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు కానీ సమాచారమివ్వాలని సూచించారు.


Updated Date - 2021-12-31T05:18:07+05:30 IST