కాంగ్రెస్‌లో వర్గ పోరు

ABN , First Publish Date - 2021-12-29T05:08:43+05:30 IST

ఆలులేదు చూలు లేదు కొడు కు పేరు సోమలింగం అన్నట్లు ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకు పెచ్చుమీరుతోంది.

కాంగ్రెస్‌లో వర్గ పోరు
మామిడితోటలో కాంగ్రెస్‌ పోటీ సమావేశం (ఫైల్‌)

నత్తనడకన సభ్యత్వ నమోదు

ఇల్లెందు, డిసెంబరు 28: ఆలులేదు చూలు లేదు కొడు కు పేరు సోమలింగం అన్నట్లు ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గపోరు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలతో  ద్వితీయశ్రేణి కాంగ్రెస్‌ కార్యకర్తలు తీవ్ర ఆ వేదన చెందుతున్నారు. రెండు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో నాయకుల పనితీరు ఎలా ఉన్నప్పటికీ ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించారు. అ యితే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వా రు అధికార టీఆర్‌ఎస్‌లో చేరడంతో నియోజకవర్గంలో కాం గ్రెస్‌కు ప్రధాన నాయకులు,  పెద్ద దిక్కులేకుండా పోయి ఎవరికివారు యమునా తీరే అన్నట్లుగా పార్టీ పరిస్ధితి మా రింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల కోసం ఆర్రులు శాస్తున్న కొందరు నాయకులు గ్రూపు రాజకీ యాలకే పరిమిత మవుతుండటం, డీసీసీ నుంచి సమన్వ యం లేకపోవడంతో క్యాడర్‌ పాలుపోని రీతిలో కూరుకుపో తుంది. దేశవ్యాపితంగా జరుగుతున్న కాంగ్రెస్‌ డిజీటల్‌ స భ్వత్య నమోదు కార్యక్రమం ఇల్లెందు నియోజకవర్గంలో నత్తనడకన సాగుతోంది. కనీసం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సభ్వత్యాల నమోదులు జరిపే ఎన్యూనే మటర్లనే పూర్తిస్ధాయిలో  నియమించకపోవడం గమనా ర్హం. పార్టీలో నెలకొన్న గ్రూపుల నాయకులు సామాజిక వ ర్గాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు పార్టీ విస్తరణకు తోడ్పడక పోగా క్యాడర్‌ను మరింత నిరుత్సహనికి గురి చేస్తున్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. కాంగ్రెస్‌ సం స్ధాగత కార్యక్రమాలు, దివంగత నేతల జయంతులు, వ ర్ధంతులు సైతం ఇల్లెందులో గ్రూపుల వారిగానే జరుపు తుండటం గమనార్హం. నియోజకవర్గంలో పార్టీ సభ్వత్య నమోదుపై ఇటీవల ఇల్లెందులో నిర్వహించిన సమీక్ష స మావేశానికి డీసీసీ అద్యక్షుడు పొదెం వీరయ్య, మహ- బాద్‌ పార్లమెంట్‌ సభ్యత్వాల ఇన్‌చార్జ్‌ పోట్ల నాగేశ్వర్‌రావు, కేంద్రమాజీ మంత్రి బలరాంనాయక్‌ హాజరయ్యారు. కాగా ఈ సమావేశానికి కామేపల్లి, గార్ల మండలాల నాయకులు గైర్హాజర్‌ కాగా తుది దశలో బయ్యారం మండల నాయ కులు హాజరై నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకుల పనితీ రుపై తీవ్ర విమర్శలకు పూనుకున్నారు. ఈసభలో డీసీసీ అద్యక్షుడు పొదెం వీరయ్య ఎన్నికల తరుణంలో పార్టీ టిక్కెట్లు తెచ్చుకునే స్ధానికేతరులను తరిమికోట్టాలని పిలు పునివ్వడంతో వేదికపైనే ఉన్న కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ రామచం ద్రనాయక్‌ తదితరులు నిశ్చేష్టులయ్యారు. అంతేగాక పలు వురు కాంగ్రెస్‌ నాయకులు డీసీసీ అధ్యక్షుడుపై పోటీ విమ ర్శలు చేయడంతో కాంగ్రెస్‌లో వర్గ పోరు రచ్చకెక్కింది. ఒక వైపు డీసీసీ అద్యక్షుడు నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల  సమావేశం ఇల్లెందు పట్టణంలో నిర్వహిస్తుండుగానే  మరోవైపు పట్టణం సమీపంలోని మామిడితోటలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోటీ సమావేశం ఏ ర్పాటు చేయడం గమనార్హం. సభ్యత్వ నమోదు పార్లమెం ట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న పోట్ల నాగేశ్వర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌ తదితరులు  స్వయంగా మామిడితోటలో జరిగిన కాంగ్రెస్‌ నాయకుల పోటీ సమావేశానికి సైతం హాజరై పార్టీ ఐక్యతకు సభ్యత్వాల నమోదుకు కృషి చేయాలని కోరడం గమనార్హం. 

నత్తనడకన సభ్యత్వాల నమోదు 

కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదుకు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉన్నప్పటీకీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదులు ఊపందుకోలేదు. నియోజకవర్గంలోని కామే పల్లి మండలంలో దివంగత మాజీమంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి కుటుంబీకులు, కార్యకర్తల నాయకత్వంలోనే సభ్యత్వ నమోదు ఉత్సహంగా సాగుతోంది. ఇల్లెందు నియోజక వర్గంలోని పలు మండలాల్లో సభ్యత్వ నమోదుకు ఇంకా పూర్తిస్ధాయిలో ఎన్యూమరేటర్లనే నియమించకపోవడం చర్చనీయాంశమైది. టీపీసీసీ కేవలం పార్లమెంట్‌ నియో జకవర్గం స్ధాయిలోనే సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీలను నియమించడంతో అసెంబ్లీ సెగ్మేంట్ల స్ధాయిలో సభ్వత్య నమోదులను పట్టించుకునే నాధులే కరువయ్యారు. 


Updated Date - 2021-12-29T05:08:43+05:30 IST