కాంగ్రె్‌సతోనే సామాన్యుడికి మేలు: సంబాని

ABN , First Publish Date - 2021-12-10T04:50:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. సామాన్యుడికి మేలు జరగాలంటే రెండుచోట్లా కాంగ్రెస్‌ పార్టీ అధికారం తోనే సాధ్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబానీ చంద్రశేఖర్‌ అన్నారు.

కాంగ్రె్‌సతోనే సామాన్యుడికి మేలు: సంబాని

సత్తుపల్లి, డిసెంబరు 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారాలని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. సామాన్యుడికి మేలు జరగాలంటే రెండుచోట్లా కాంగ్రెస్‌ పార్టీ అధికారం తోనే సాధ్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీమంత్రి సంబానీ చంద్రశేఖర్‌ అన్నారు. యావత్‌ దేశంలో మొట్టమొదటి సారిగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని బేతుపల్లిలో ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నుంచి కార్యకర్తలను నమోదు చేస్తున్నామని, ఈసారి వచ్చేది కాంగ్రెస్‌ అభ్యర్థేనని చెప్పారు. టీపీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి చొరవతో కేవలం తెలంగాణాలోనే కార్యకర్తకు రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ పథకం వర్తింపజేస్తుందని, 35లక్షల సభ్యత్వాల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. వరిపొలాల్లో ఆరుతడి పంటలు పండవని శాస్త్రవేత్తలు చెబుతుంటే రాష్ట్రం ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తుందని, ఇంకా కోటి ఎకరాలకు మాగాణి, ప్రాజెక్టులు ఎందుకు అని ప్రశ్నించారు. కార్యకర్తలు కష్టపడి పనిచేసి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రేజర్ల సర్పంచ్‌ జక్కుల ప్రభాకరరావు, కాంగ్రెస్‌ పార్టీ మండల, పట్టణ కమిటీ అధ్యక్షులు శివా వేణు, కొర్రపాటి సాల్మన్‌రాజు, గోళ్ల అప్పారావు, చిలుకుర్తి జగదీష్‌, కాలం కృష్ణ, బాల చెన్నారావు, గునపంనేని రాంబాబు, కే.చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దపల్లి దుర్గాప్రసాద్‌, పుచ్చకాయల సోమిరెడ్డి, లక్ష్మారెడ్డి, భూపతిరెడ్డి, తోట రాజేష్‌, రాయల కోటేశ్వరరావు, నరుకుళ్ల శ్రీనివాసరావు, దోసపాటి శ్రీనివాసరావు, నల్లంటి వెంకటకృష్ణ, బాల సత్యనారాయణ, కొత్తపల్లి మహేష్‌, బాలాజీ, వారపు రాజా, ఖలీల్‌, పాల్గొన్నారు.


Updated Date - 2021-12-10T04:50:36+05:30 IST