దళిత, గిరిజనులకు ఆత్మబంధువు కాంగ్రెస్
ABN , First Publish Date - 2021-09-04T04:15:23+05:30 IST
దళిత గిరిజ నులకు అసలైన బంధువు కాంగ్రెస్ మాత్రమేనని, వారి సమస్య లపై సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని పీసీసీ ప్రధాన కార్య దర్శి కోటూరి మానవతా రాయ్ అన్నారు.

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, సెప్టెంబర్ 3: దళిత గిరిజ నులకు అసలైన బంధువు కాంగ్రెస్ మాత్రమేనని, వారి సమస్య లపై సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని పీసీసీ ప్రధాన కార్య దర్శి కోటూరి మానవతా రాయ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ధర్నాచౌక్‌లో భద్రాద్రి యువజన కాం గ్రెస్ జిల్లా అధ్యక్షుడు గురజాల వెంకట్ ఆధ్వర్యంలో చేపట్టగా ఆయన పాల్గొన్నారు. ఈ దీక్షలను టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జేబీ. శౌరీ ఆయనకు పూలమా లలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళిత బంధు కేవలం హుజురాబాద్ ఎన్నికల్లో జిమ్మిక్కులతో గెలవాలనే ఎత్తుగడలో భాగమే కానీ దళితులకు నిజంగామంచి చేయాలనే ఉద్దేశం లేదని విమర్శించారు. రాష్ట్రం రవాణ కాష్టంలా తయారైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనులకు అసలైన బంధువని, ఇప్పుడేదో కేసీఆర్ ఒక పది మందికి తలా రూ.10లక్షల చెక్కులు ఇచ్చినంత మాత్రాన టీఆర్‌ఎస్ పార్టీ దళితబందుగా మారలేదన్నారు. మొన్న హుజు రాబాద్‌లో 15మందికి ఇచ్చిన చెక్కులు ఇప్పటికి డబ్బులుగా మారలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌కి దళితుల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్న వెంటనే ఈ పథకాన్ని రాష్ట్రమంతా అమలు చే యాలని కోరారు. కల్లబొల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని సీఎం కేసీఆర్ బావిస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రమంతా ప్రజలకు నిజాలు వివరిస్తూ తిరిగేందుకు సిద్దమయ్యామని అందులో భాగమే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో దళిత గిరిజన స త్యాగ్రహ దీక్షలను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గురిజాల వెంకట్ మాట్లాడుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే కొత్తగూడెంలో దళితులకు దళితబంధు వస్తుందని అన్నారు. ఈ విషయమై ఆలోచన చేయాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వీరబాబు, షేక్ హపీజ్, గడ్డం రాజశేఖర్, అనుదీప్, బానోత్ కోటేష్, కంది శివ, రెడ్డిమళ్ల మణికంఠ, పోతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కొర్సా ఆనంద్, ఇస్లావత్ సాయి, పాలకుర్తి సుమిత్ తదితరులు పాల్గొన్నారు.