భూమి వివరాలు ఆన్లైన్లో లేవని ఆందోళన

ABN , First Publish Date - 2021-09-04T04:33:26+05:30 IST

తన భూమి ఆనలైనలో కన్పించటం లేదని ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ముదిగొండ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

భూమి వివరాలు ఆన్లైన్లో లేవని ఆందోళన

ముదిగొండ, సెప్టెంబరు 3: తన భూమి ఆనలైనలో కన్పించటం లేదని ఓ రైతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ముదిగొండ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఖమ్మం రూరల్‌ మండలం గుదిమళ్ల గ్రామానికి చెందిన ఎమిక వెంకటేశ్వర్లుకు ముదిగొండ మండలం పండ్రేగుపల్లి రెవెన్యూలోని ఖాతానెంబర్‌ 460లోని సర్వేనెంబర్‌ 15/అ/4/1, 15/అ1లో  రెండెకరాల 20కుంటల భూమి ఉంది. భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నప్పటికీ ఆనలైనలో మాత్రం కనిపించన చెందాడు. రెండేళ్లుగా ఆర్డీవో, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ దృష్టికి తన సమస్యను తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో శుక్రవారం రైతు వెంకటేశ్వర్లు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి రెవెన్యూ కార్యాలయంకు వచ్చి తన భూమిని ఆనలైనలో ఎక్కించాలంటూ ఆందోళన చేశాడు. తహసీల్దార్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను తన సమస్య పరిష్కరించమని కోరగా తనకు సంబంధం లేదన్నారు. దీంతో రైతుల ఆందోళనకు దిగడంతో నాయబ్‌ తహసీల్దార్‌ కరుణాకర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని చెప్పారు. దీంతో ఎస్‌ఐ నరేష్‌ రైతుతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. 

Updated Date - 2021-09-04T04:33:26+05:30 IST