సకాలంలో కౌంటర్‌ ఫైల్స్‌ దాఖలు చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-10T04:06:51+05:30 IST

జిల్లాలోని కోర్టు కేసులకు సకా లంలో కౌంటర్‌ ఫైల్స్‌ ధాఖలు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధి కారులను ఆదేశించారు.

సకాలంలో కౌంటర్‌ ఫైల్స్‌ దాఖలు చేయాలి: కలెక్టర్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 9: జిల్లాలోని కోర్టు కేసులకు సకా లంలో కౌంటర్‌ ఫైల్స్‌ ధాఖలు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌ లీగల్‌సెల్‌ ద్వారా నిరంతరం పర్యవే క్షణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్‌వో అశోక్‌చక్రవర్తికి సూచించారు. కౌంటర్‌ ఫైళ్లు స్పష్టంగా అర్థమయ్యే విధంగా దాఖలు చేయాలన్నారు. నిరుపేదలకు చెందాల్సిన రేషన్‌బియ్యం బ్లాక్‌ మార్కె ట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలస్థాయి రేషన్‌దుకాణ డీలర్లతో సమావేశం నిర్వహించి బియ్యం సక్రమంగా పంపిణీ జరిగే విధంగా చూడాలన్నారు. మండల స్థాయిలో పౌర సరఫరాల నాయబ్‌ తహసీల్దార్లు రేషన్‌ బియ్యం పంపిణీలను తనిఖీ చేయాలన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తి చేయాల న్నారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, సకాలంలో బియ్యం పంపిణీ చేయని డీలర్లుపై కేసులు నమోదుతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని, ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్లు నియామకానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకా లంలో పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో అశోక్‌ చక్రవర్తి, పంచాయతీరాజ్‌  ఈఈ సుధాకర్‌, గిరిజన ఇంజనీరింగ్‌ విభాగం ఈఈ రాములు, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్‌, మైనింగ్‌ ఏడీ జయ్‌సింగ్‌, ఏవో గన్యా తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T04:06:51+05:30 IST