ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-11-10T03:12:24+05:30 IST

సీజన్‌ ప్రారంభం అయినందున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేయాలని జిల్లా క లెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

అఽధికారులకు కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 9: సీజన్‌ ప్రారంభం అయినందున కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేయాలని జిల్లా క లెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. ధా న్యం కొనుగోలు ప్రక్రియపై మంగళవారం కలెక్ట రేట్‌ నుంచి పౌరసరఫరాలు, వ్యవసాయం, స హకార, జీసీసీ, మార్కెటింగ్‌, డీఆర్‌డీవోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొనుగోలు కేం ద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎటువంటి లోటుపాట్లు రావద్దన్నారు. నాణ్యత పాటించే విధంగా ఏఇఓ, ఏఓలు రైతులను సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా రై తులకు అవగాహన కార్యక్రమాలు చే పట్టాలన్నారు.జిల్లా వ్యాప్తంగా 154 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులనుండి ధాన ్యం అధికంగా వచ్చే కేంద్రాల్లో అదనపు యంత్రాలను అందుబాటులో ఉంచాల న్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసేందుకు ప్రతి మిల్లును జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. హమాలీలు, లారీలు, గన్ని బ్యా గుల కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేచి ఉంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేకుండా ఉండేందుకు ముందస్తుగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని ఆదేశించారు. పక్క రాష్ట్రాలు, జిల్లాల నుంచి మన జిల్లాకు ధాన్యం రాకుండా బోర్డర్‌ చెక్‌ పోస్టులల్లో పటిష్ట పర్య వేక్షణ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


Updated Date - 2021-11-10T03:12:24+05:30 IST