నిధుల వినియోగంలో అలసత్వం వద్దు
ABN , First Publish Date - 2021-07-09T04:49:48+05:30 IST
జిల్లాలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం వహించవద్దని, సకాలంలో పనులు పూర్తిచేసి సద్వినియోగం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధి కారులను ఆదేశించారు.

కొత్తగూడెం కలెక్టరేట్ జూలై 8: జిల్లాలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వినియోగంలో అధికారులు అలసత్వం వహించవద్దని, సకాలంలో పనులు పూర్తిచేసి సద్వినియోగం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో డీఎంఎఫ్‌టీ, సీ ఎస్‌ఆర్, ఎస్‌సీఏ నిధుల కేటాయింపు వినియోగంపై జిల్లా అధికారులు, కేటీపీ ఎస్, నవభారత్, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమల అధికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారిగా ఆ యా నిధుల ద్వారా చేపట్టిన పనుల ప్రగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికా రులను అడిగి తెలుసుకొన్నారు. కేటాయించిన నిధులతో పనులు చేయని నిధు లను వడ్డీతో సహా సరెండర్ చేయాలని ఆదేశించారు. ఈ నిధులతో ప్రాధా న్యతను బట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపడతామని స్పష్టం చేశారు. నిధులు కేటాయించింది బ్యాంకుల్లో నిల్వ ఉంచడానికి కాదని, పనులు సకాలంలో చేయకపోతే వాటి మంజూరుకు సార్ధకత ఏమిటని ఆయన అధికా రులను ప్రశ్నించారు. ఆ నిధులు తమ వ్యక్తిగత నిధులు కావని, ప్రజా సంక్షేమా నికి కేటాయిస్తే ఎందుకు వినియోగించలేక పోతున్నారో అని మండిపడ్డారు. చేపట్టిన పనులకు సంబంధించి మూడు విభాగాల ఫొటోలు పని ప్రారంభించక ముందు, ప్రగతి, పూర్తిచేసిన ఫోటోలను జతపరిచి సకాలంలో ద్రవ్యవినియమ పత్రాలతో పాటు నాణ్యతా ప్రమాణాల తనిఖీ నివేదికలను డీఆర్‌డీవో ద్వారా కలెక్టరేట్‌కు సమర్పించాలని ఆదేశించారు. డీఎంఎఫ్‌టీ నిధులు కేటాయింపుపై శాఖల వారిగా కేటాయించిన నిధులు, చేపట్టిన పనులు, ప్రగతి, యూసిలు స మర్పణపై నివేదికలు అందచేయాలని డీఆర్‌డీవోకు సూచించారు. పనులు ప్ర గతిపై నిరతరం సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేసి వేగవంతం ఆయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.