పనుల సమగ్ర నివేదిక సమర్పించండి

ABN , First Publish Date - 2021-08-11T04:59:02+05:30 IST

జిల్లాలో మినలర్‌ డెవలప్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్‌ అను దీప్‌ అధికారులను ఆదేశించారు.

పనుల సమగ్ర నివేదిక సమర్పించండి

కొత్తగూడెం కలెక్టరేట్‌ ఆగస్టు 10: జిల్లాలో మినలర్‌ డెవలప్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదికలు అందజేయాలని కలెక్టర్‌ అను దీప్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డీఆర్‌డీవో, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్‌, పశుసంవర్థక, ఉద్యాన, మునిసి పల్‌ కమిషనర్లు, సింగరేణి అధికారులతో డీఎంఎఫ్‌టీ నిధులు కేటాయింపు, వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులకు మంజూరు చేసిన నిధుల ప్రకారం చేపట్టిన పనులు, పనుల పురోగతి, నిదుల కేటాయింపుపై నివేధికలు అందజేయాలన్నారు. జిల్లాలో 18శాఖల్లో 1931 అభివృద్ది పనులు చేపట్టేందుకు డీఎంఎఫ్‌టీ నిధులు మజూరు చేశామన్నారు. వాటిల్లో 253 పనులు ప్రారంభం కాలేదని, 762 పనులు పురోగతిలో ఉన్నాయని, 916 పనులు పూర్తి చేశా రన్నారు. చేపట్టిన పనులకు సంబంధించి పనులు చేయడానికి ముందు, చేపట్టిన సందర్భంలోని, పూర్తి చేసిన తర్వాత ఫోటోలతో సహా అందజేయాలని ఆదేశించారు. ప్రజల ప్రయోజనాలకోసం పనులు చేయడానికి నిధులు మం జూరు చేశామన్నారు. సకాలంలో పూర్తిచేయకపోవడం వల్ల అటు ప్రజలకు, ఇటు యంత్రాగానికి ఇబ్బందులు వస్తున్నాయని, సకాలంలో పనులు పూర్తి చే యని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టు రద్దుచేయాలని, ఇతరులకు పనులు కేటాయించాలని ఆదేశించారు. ఇచ్చిన నిధులు బ్యాంకుల్లో నిల్వ ఉంచుకోవడానికి కాదని, పనులు సకాలంలో చేయడానికన్నారు. ప్రారంభం కాని పనులకు కేటాయించిన నిధులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలన్నారు. 


Updated Date - 2021-08-11T04:59:02+05:30 IST