గ్రీన్ భద్రాద్రి చేయడమే ప్రధాన లక్ష్యం: కలెక్టర్
ABN , First Publish Date - 2021-01-13T04:54:52+05:30 IST
జిల్లాను గ్రీన్ భద్రాద్రిగా చేయడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు.

కొత్తగూడెం కలెక్టరేట్, జనవరి 12: జిల్లాను గ్రీన్ భద్రాద్రిగా చేయడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా, మండల అధికారులు, మునిసిపల్ కమి షనర్లతో మొక్కల సంరక్షణపై టెలీ కాన్పరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సోమ వారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మొక్కలు నాటిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అని అభి నందించారన్నారు. ఈ మహా కార్యక్రమంలో పాలుపంచుకొన్న ప్రజలందరికీ ముఖ్యమంత్రి నుంచి లభించిన గౌరవమని, ఇదే స్ఫూర్తితో జిల్లాన హరిత భధ్రాద్రిగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలల్లో మొక్కల పెంచే కా ర్య క్రమాన్ని ఈనెల 20వ తేదీ వరకు చేపట్టాలన్నారు. ఎంతో కష్ట పడి నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలు పెంచే నర్సరీలో మొక్కలు పెంచే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం అం డర్ బ్రిడ్జి వద్ద డివైర్లలో అందమైన మొక్కలు నాటాలని పలు మార్లు చెప్పినప్పటికి మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నారని, పశువులు, పందుల, కుక్కల సంచరిస్తు న్నా యని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కమిషనర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్‌లో 78శాతం మాత్రమే జరిగిందన్నారు. వెనుకంజలో ఉన్న మండలాల ఎంపీడీవో, ఎంపీవోలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 16వ తేదీ నాటికి నూరుశాతం మొక్కలకు జియో ట్యాగింగ్ చేయా లని ఆదేశించారు. మొక్కల సంరక్షణకు వాచ్‌మెన్ నియమిం చాలని కలెక్టర్ ఆదేశించారు.