లోకరక్షకుడు అరుదెంచెను

ABN , First Publish Date - 2021-12-26T06:06:49+05:30 IST

క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థన మందిరాలు క్రైస్తవ సోదరులతో కళకళలాడాయి.

లోకరక్షకుడు అరుదెంచెను
భద్రాచలంలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే వీరయ్య

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

క్రైస్తవుల ప్రార్థనలతో చర్చిల్లో సందడి

పలు చోట్ల పేదలకు వస్త్ర, అన్నదానాలు

నెట్‌వర్క్‌: క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్‌ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థన మందిరాలు క్రైస్తవ సోదరులతో కళకళలాడాయి. అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం నియోజకవర్గాలలోని వివిధ చర్చీ ల్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా చర్చీల్లో శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు శనివారం మధ్యాహ్నాం వరకు కొనసాగాయి. ప్రార్థనా మందిరాల్లో కేక్‌లను కట్‌ చేసి మిఠాయిలు పంచారు. వేడుకల్లో భాగంగా చర్చీలను అందంగా విద్యుత్తు దీపాలతో అలంకరించారు. పలుచోట్ల అన్నదాన, వస్త్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. కిస్మస్‌ సందర్భంగా పలు చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ చిన్నారులు, యువతీ యువకులు నృత్యాలు చేసి అలరించారు. కార్యక్రమాల్లో చర్చిల ఫాస్టర్లు, పెద్దలు, సంఘస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆళ్లపల్లిలో నిర్వహించిన వేడుకల్లో పాస్టర్‌ డేవిడ్‌, జ్యోతిర్మయి యానిమేటర్‌ ప్రభాకర్‌, సునీల్‌, కన్నయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఖదీర్‌, సత్యం, కాంత్‌, సత్యనారాయణ, జానీ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

దుమ్ముగూడెంలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసరావు, శ్రీకాంత్‌, మల్లేశ్వరావు, ఎస్కే ఖాదర్‌, ఉపసర్పంచ్‌ జెట్టి రామకృష్ణ, మాణిక్యాల రావు, ఐశ్రీనివాసరావు, శ్రావణ్‌, విజయరావు, పుష్పరాజు, కనకరాజు పాల్గొన్నారు.

మణుగూరులో నిర్వహించిన వేడుకల్లో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, చర్చి ఫాదర్‌ స్టీవెన్‌ రాజు, జాన్‌వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సొసైటీ ఛైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ముత్యం బాబు, మండల కో ఆప్షన్‌ సభ్యుడు జావీద్‌ పాషా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

భద్రాచలంలోని సీఎస్సై చర్చిలో శనివారం తెల్లవారుజాము నుంచి భక్తి ప్రపత్తులతో క్రిస్మస్‌ ఆరాధనలు భక్తులు జరిపారు. తెల్లవారుజామునే స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా ముందుగా చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్దనల్లో పాల్గొన్నారు. చర్చిలో జరిగిన ప్రార్దన కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చర్చి ఫాస్టర్‌  క్రిస్మస్‌ విశిష్టతను భక్తులకు వివరించారు. దైవం పట్ల ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉండాలని, తమ జీవితంలో ఇతరులకు అపకారం చేయకుండా స్వచ్చమైన జీవితాన్ని గడిపిన వారికి దేవుని కృప లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

చర్ల మండల కేంద్రంలోని బైబిల్‌ మిషన్‌ చర్చి నందు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాస్టర్‌ యేసుజీన్‌ క్రిస్మస్‌ సందేశం వినిపించారు. ఈ సందర్బంగా సంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్దలు పూనెం దాని యేలు, పల్లి రమేష్‌, గాదె కృపామణి, యోహానా, ఎకుల మహిమ, సామ్యేల్‌ తదితరులు ఉన్నారు. అలాగే మండలంలోని వివిధ చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు అంబరాన్ని అంటాయి.


Updated Date - 2021-12-26T06:06:49+05:30 IST