13న చలో ఖమ్మం

ABN , First Publish Date - 2021-02-06T04:55:36+05:30 IST

గిరిజన రిజర్వేషన్లను 12శాతానికి పెంచాలని, పోడుసాగుచేసుకుంటున్న గిరిజనులందరికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న నిర్వహించే చలో ఖమ్మం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లంబాడీ హక్కుల పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్‌ దశరథ్‌నాయక్‌ పిలుపునిచ్చారు.

13న చలో ఖమ్మం

తల్లాడ, ఫిబ్రవరి 5: గిరిజన రిజర్వేషన్లను 12శాతానికి పెంచాలని, పోడుసాగుచేసుకుంటున్న గిరిజనులందరికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న నిర్వహించే చలో ఖమ్మం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లంబాడీ హక్కుల పోరాటసమితి జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్‌ దశరథ్‌నాయక్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం తల్లాడ మండలం మల్సూర్‌తండాలో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 13వతేదీ ఉదయం 11గంటల నుంచి ఖమ్మం అంబేద్కర్‌ భవన్‌లో ఉమ్మడి ఖమ్మంజిల్లా అవగాహన సదస్సు జరుగుతుందని, ముఖ్యఅతిథిగా లంబాడీ హక్కుల పోరాటసమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు దాసూరామ్‌నాయక్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-02-06T04:55:36+05:30 IST