ఉమ్మడి జిల్లాలో ఒక్కరికి కరోనా

ABN , First Publish Date - 2021-11-01T04:50:26+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఒక్కరికి కరోనా

ఉమ్మడి జిల్లాలో ఒక్కరికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 31: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,063 మందికి పరీక్షలు నిర్వహించగా ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 323మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ నమోదు కాలేదు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో ఆదివారం ఓ వ్యక్తి చేరాడు. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320 బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 13మంది చికిత్స పొందుతున్నారు. 307బెడ్లు ఖాళీగా ఉన్నాయి.

Updated Date - 2021-11-01T04:50:26+05:30 IST