ఇరుజిల్లాల్లో 11మందికి కొవిడ్
ABN , First Publish Date - 2021-10-30T04:12:39+05:30 IST
ఇరుజిల్లాల్లో 11మందికి కొవిడ్
ఖమ్మం కలెక్టరేట్, అక్టోబరు 29: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 11మంది కొవిడ్ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,033 మందికి నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి, భద్రాద్రి జిల్లాలో 1063 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అలాగే 320 బెడ్లున్న ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలోని కొవిడ్ వార్డులో శుక్రవారం ఎవరూ చేరలేదని ప్రస్తుతం మొత్తం 19 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. శుక్రవారం ఒకరు డిశ్చార్జి అయ్యారు. 301 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.