ఇరు జిల్లాల్లో 48మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2021-09-03T04:50:17+05:30 IST

ఇరు జిల్లాల్లో 48మందికి కొవిడ్‌

ఇరు జిల్లాల్లో 48మందికి కొవిడ్‌

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 2: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,072 మందికి పరీక్షలు నిర్వహించగా 33పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2,816 మందికి పరీక్షలు నిర్వహించగా 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో గురువారం ఇద్దరు చేరారు. ఏడుగురు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 40మంది చికిత్స పొందుతున్నారు. 280 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కరోనా
పినపాక మండలం గోవిందాపురంలో కలకలం
స్కూలుకు వారంపాటు సెలవు ప్రకటించిన ఎంఈవో
పినపాక, సెప్టెంబరు 2:
ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్‌ రావడం
పినపాక మండలం గోవిందాపురంలో కలకలం రేపింది. గోవిందాపురం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి గురువారం కరోనా నిర్దారణ కావడంతో ఎంఈవో వీరస్వామి ఆ పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. దాదాపు ఏడాదిన్నర పాటు మూతపడ్డ పాఠశాలలు బుధవారం పునఃప్రారంభం కాగా రెండో రోజే ఓ ఉపాధ్యాయుడికి పాజి టివ్‌ రావడంతో గోవిదాపురం పాఠశాలకు మళ్లీ తాళం వేశారు.

Updated Date - 2021-09-03T04:50:17+05:30 IST