క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించాలి
ABN , First Publish Date - 2021-11-27T04:35:57+05:30 IST
సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుందని, దానిని తొలిదశలో గుర్తించి చికిత్స చేసేందుకు స్ర్కీనింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని జిల్లా వైద్యా ధికారిణి జేవీఎల్ శిరీష అన్నారు.

డీఎంహెచ్‌వో జేవీఎల్ శిరీష
క్యాన్సర్ స్ర్కీనింగ్‌పై వైద్యులకు అగాహన
కొత్తగూడెం టౌన్/ కొత్తగూడెం కలెక్టరేట్ నవంబరు 26 : సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుందని, దానిని తొలిదశలో గుర్తించి చికిత్స చేసేందుకు స్ర్కీనింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని జిల్లా వైద్యా ధికారిణి జేవీఎల్ శిరీష అన్నారు. శుక్రవారం మునిసిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో డీఎంహెచ్‌వో అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక, అర్బన్ ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ వెల్‌నెస్ సెంటర్, పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యులకు క్యాన్సర్ స్రీనింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌సీడీ పోగ్రాం అఽధికారి డీఎల్ ప్రసాద్ శిక్షణ క ల్పించారు. ఆనంతరం డీవోఎంసీహెచ్ సుజాత మాట్లాడుతూ.. క్యా న్సర్ వ్యాధిని ఎలా గుర్తించాలో అవగాహన కల్పించారు. ఎన్‌ఈడీ పోగ్రాంలో భాగంగా జిల్లాలో 30సంవత్సరాలు నిండినమహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ గుర్తింపునకు స్ర్కీనింగ్ నిర్వహించా లన్నారు. అనుమానిత కేసులను జిల్లా ప్రధాన వైధ్యశాలకు సిపారసు చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో టీ-హబ్ పోగ్రాం అధికారి బావ్ సింగ్, పీవోఎఫ్‌డబ్ల్యూ స్వాతిశ్రీ, ఎన్‌సీడీ కో-ఆర్డినేటర్ రాంప్రసాద్, డిఫ్యూటీ డీఎంహెచ్‌వో మొయినుద్దీన్, ఆరోగ్య విద్యాబోధకులు విజయ్‌కుమార్ పాల్గొన్నారు.