ఒకే కాన్పులో ముగ్గురు ఆడశిశువుల జననం

ABN , First Publish Date - 2021-10-21T04:56:23+05:30 IST

ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందో మాతృమూర్తి.

ఒకే కాన్పులో ముగ్గురు ఆడశిశువుల జననం
జన్మించిన ముగ్గురు ఆడశిశువులు

 అరుదైన ప్రసవం చేసిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు

ఖమ్మంకలెక్టరేట్‌, అక్టోబరు 20: ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందో మాతృమూర్తి. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ అరుదైన ప్రసవానికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి ఆర్‌ఎంవో బి శ్రీనివాసరావు  వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడుకు చెందిన సంకె దివ్య ప్రసవ వేదనతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమెకు ఇది రెండో కాన్పు కావడంతో వైద్యులు భార్గవి, రాణిసువిధ ఆపరేషన్‌ చేశారు. ఈ కాన్పులో ఆ మాతృమూర్తి ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పుట్టిన ముగ్గురు ఆడశిశువులు రెండు కిలోల చొప్పున సంపూర్ణఆరోగ్యంగా ఉన్నారని ఆర్‌ఎంవో తెలిపారు. 

Updated Date - 2021-10-21T04:56:23+05:30 IST