విలువల రాజకీయానికి ప్రతిరూపం కట్టా

ABN , First Publish Date - 2021-12-29T05:24:43+05:30 IST

విలువలతో కూడిన రాజకీయాలు నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసి మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య నేటి రాజకీ య నాయకులకు ఆదర్శంగా నిలిచారు.

విలువల రాజకీయానికి ప్రతిరూపం కట్టా
ఆవిష్కరణకు సిద్ధమైన కట్టా కాంస్య విగ్రహం

చివరి వరకు ప్రజల పక్షాన నిలిచిన  మధిర మాజీ ఎమ్మెల్యే 

వెంకట నర్సయ్య  2న  పోచవరంలో  

కట్టా కాంస్య విగ్రహ ఆవిష్కరణ

  హాజరుకానున్న మంత్రి కేటీఆర్‌

కల్లూరు, డిసెంబరు28: విలువలతో కూడిన రాజకీయాలు నిర్వహించి, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేసి మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య నేటి రాజకీ య నాయకులకు ఆదర్శంగా నిలిచారు. కల్లూరు మండలంలోని పోచవరం గ్రామంలో జనవరి 2న(ఆదివారం) కట్టా ప్రఽథమ వర్ధంతి నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, స్థానిక గ్రామా ప్రజల ఆధ్వర్యంలో  రూ.25 లక్షల అంచనాతో  నిర్మించిన కాంస్య విగ్రహ అవిష్కరణ జరగనున్నది. మండలంలోని పోచవరం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో  సూరయ్య, నర్సయ్య దంపతుల ప్రఽథమ కుమారుడైన వెంకటనరసయ్య విద్యార్థి దశనుంచి ఉద్యమ నాయ కుడిగా పని చేశారు. అదే స్ఫూర్తితో సీపీఎం తరుపున ఒక రాజకీయ నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. పేద ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఎమర్జెన్సీ, రజాకార్ల పాలన సమయంలోనూ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. 1977లో పోచవరంలో కమ్యూనిస్టు పార్టీ మహాసభ జరగగా అప్పట్లో మధిర డివిజన్‌ సీపీఎం కార్యదర్శిగా కట్టా వెంకటనరసయ్యను ఎన్నుకున్నారు. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలనలో తల్లాడ రెవెన్యూ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. దీనిపై దృష్టి సారించిన కట్టా ప్రజా పక్షాన పోరాటం చేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఈక్రమంలో పలుధఫాలుగా జైలుకు వెళ్లారు. 

1984లో మధిరలో సీపీఎం కార్యాలయ నిర్మాణం

1981లో నాటిసమితిగా ఉన్న మధిర ఎన్నికల్లో సీపీఎం తరుపున రామిశెట్టి పుల్లయ్య ఎన్నికకు ఎంతో కృషి చేశారు. ఫలితంగా సీపీఎం విజయం సాధించింది. 1984 లో మధిరలో సీపీఎం కార్యాలయ నిర్మాణం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఇలా పార్టీ విస్తరణ కోసం ఎంతో కృషి చేశారు. 

ఎమ్మెల్యేగా కట్టా ప్రస్థానం...

1996లో బోడెపూడి వెంకటేశ్వరరావు మృతితో 1997లో మధిర ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో  కట్టా వెంకటనరసయ్య పోటీ చేసి, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో మలి విడత జరిగిన ఎన్నికల్లో కట్టా ఓటమి చెందారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి కట్టా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాటి నుంచి 2009 వరకు అదే హోదాలో ఆయన ప్రజలకు సేవలు అందించారు. సీపీఎంలో కూడా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రాష్ట్ర సభ్యుడిగా పనిచేశారు. నాడు మధిర నియోజక వర్గంలో గ్రామా గ్రామాన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసింది. గ్రామీణ, ఆయుకట్టు రహదారుల అభివృధ్దికి, సాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో చివరి భూముల రైతులకు సాగే నీరు అందించే విషయంలో ఆయన కృషి ఎంతో గాను ఉంది. 

తది శ్వాస వరకు కట్టా సీపీఎం అభ్యుదయ వాది...

2009లో సీపీఎంలో ఏర్పడిన అంతర్గత కలహాలతో పార్టీకి దూరమయ్యారు. నుంచి ఆయన రాజకీయంగా పార్టీ కార్యకాలపాల్లో పాల్గొనలేదు. అదే భావ జాలంతో తదిశ్వాస వరకు అభ్యుదయ కమ్యూనిస్టుగా నిలిచారు. ఇలా రాజకీయాల్లో నిజాయితీ, వ్యక్తిగత క్రమ శిక్షణతో కట్టా వెంకటనరసయ్య రాజకీయ ప్రయాణం సాగింది. 


Updated Date - 2021-12-29T05:24:43+05:30 IST