బిల్లులు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-09-04T04:59:14+05:30 IST

గ్రామ పంచాయ తీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు నిరసన తెలిపారు.

బిల్లులు విడుదల చేయాలి
నిరసన తెలుపుతున్న సర్పంచ్‌లు

తిరుమలాయపాలెం మండల సమావేశంలో సర్పంచ్‌ల నిరసన

తిరుమలాయపాలెం, సెప్టెంబరు3: గ్రామ పంచాయ తీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు నిరసన తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మంగిలాల్‌ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిరహించారు. ఈ సందర్భగా సర్పంచ్‌లు గడ్డికొప్పుల రాజు, మధుసూదన్‌ రెడ్డి, కొండ బాల వెంకటేశ్వర్లు, బి.భరత్‌చంద్ర మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో చేసిన వివిధ అభివృద్ధి పనులకు రెండునెలలుగా బిల్లులు రావడం లేదన్నారు. దీంతో తాము తీవ్రఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని సమావేశంలో తెలిపారు. కనీసం గ్రామ పంచాయతీ వర్కర్లకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయంపై జిల్లా అధికారులకు దృష్టితేవాలని కోరుతూ పోడియం ఎదుట కూర్చుని నిరసన తెలిపారు. అలాగే మండలం లోని వివిధ గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపు నిర్వాహ కులు అధిక ధరలకు అమ్ముతున్నారని, చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. బెల్టు షాపుల నిర్వాహకుల వల్ల గ్రామాల్లో వీధుల వెంట ప్లాస్టిక్‌, మద్యం బాటిళ్లుతోపాటు కవర్లు కూడా దర్శన మిస్తున్నాయని వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని,సీజన్‌దాటాక ప్రభుత్వం ఇస్తుందని, దీనివల్ల రైతులకు ప్రయోజనంలేదని సర్పంచ్‌లు చెప్పారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యసిబ్బంది స్థానికంగా ఉండాలని, ప్రస్తుత సీజన్‌లో డెంగీ, మలేరియా, తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేయాలని కోరారు.   పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈసమావేశంలో ఎంపీపీ మంగిలాల్‌, జడ్పీటీసీ శ్రీను, ఎంపీడీవో జయరాం, మండల ఉపాధ్యక్షుడు బుద్ద వంశీకృష్ణ, సీడీపీవో బాల త్రిపుర సుందరి, ఏవో సీతారాంరెడ్డి, సర్పంచ్‌లు రాజు, రవి, కొండబాల వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, జోగుపర్తి లక్ష్మి, మట్టా కరుణశ్రీ, పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T04:59:14+05:30 IST