రామయ్య కల్యాణానికి రండి

ABN , First Publish Date - 2021-03-25T05:19:58+05:30 IST

శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్‌ 21న భద్రాచలంలో నిర్వహించే స్వామివారి కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆహ్వానించారు.

రామయ్య కల్యాణానికి రండి
అసెంబ్లీలో మాట్లాడుతున్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ఆ ఐదు పంచాయతీలపైనా చొరవ తీసుకోవాలి

 అసెంబ్లీలో సీఎంను కోరిన భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య

భద్రాచలం, మార్చి 24: శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్‌ 21న భద్రాచలంలో నిర్వహించే స్వామివారి కల్యాణానికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆహ్వానించారు. భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే.. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత భద్రాచలం రామయ్య కల్యాణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రూ.100కోట్లతో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారని, కానీ ఈ ప్రకటన చేసి ఏడేళ్లు గడుస్తున్నా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించి, చర్లలో డ్రిగీ కళాశాల మంజూరు చేసి గిరిజన, గిరిజనేతర విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురవాలని సూచించారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో భూము లు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.30లక్షల నష్టపరిహారం అందించడంతో పాటు మిగిలిన భూములకు నీటి వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీల విషయంలో చొరవ తీసు కుని.. వాటిని భద్రాచలంలో కలి పేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాలని, భ ద్రాద్రిఅభివృద్ధికి కృషి చేయాలని ఆయ న సీఎంను కోరారు. 


Updated Date - 2021-03-25T05:19:58+05:30 IST