నేత్రపర్వంగా ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-04-20T05:52:18+05:30 IST

నేత్రపర్వంగా ధ్వజారోహణం

నేత్రపర్వంగా ధ్వజారోహణం
ధ్వజారోహణం సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

సంప్రదాయబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ

భద్రాద్రిలో నేడు ఎదుర్కోలు, రేపు నవమి కల్యాణం

కొవిడ్‌ మార్గదర్శకాల ప్రకారం కార్యక్రమాలు: ఈవో

భద్రాచలం, ఏప్రిల్‌ 19: తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానంలో సోమవారం నిర్వహిం చిన ధ్వజారోహణం నేత్రపర్వంగా సాగింది. శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతునిపటాన్ని ఈ సందర్భంగా ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఇప్పటి నుంచి పూర్ణిమ నాటి వరకు నిర్వహించే ఈ బ్రహ్మో త్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవులకు తెలిపే విధంగా ఈ ధ్వజారోహణ జరుపుతారు. అలాగే అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే బేరిపూజ కార్యక్ర మాన్ని ఆచార్యులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తి లేని మహిళలకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో వి.శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు, కిషోర్‌, దేవస్థానం ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామాను జాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. 

భద్రగిరిలో నేడు ఎదుర్కోలు  

తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. గతంలో   ఉత్తరద్వారం ఎదుట స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించగా కరోనా ప్రబలుతున్న క్రమంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆలయ ప్రాంగణంలోనే ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. బుధవారం స్వామి వారి జన్మదినం రోజైన శ్రీరామనవమి రోజు కల్యాణం నిర్వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రామాలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపంలోనే కల్యాణం నిర్వహించనున్నారు గురువారం శ్రీరామ మహాపట్టాభిషేకం సైతం అక్కడే నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం, మహాపట్టాభిషేకం కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులు వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం దేవస్థానం ఈవో బి.శివాజీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ పూర్తిగా కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.  


Updated Date - 2021-04-20T05:52:18+05:30 IST